Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కబాలి హిందీ రీమేక్‌లో అమితాబ్: రజనీ సినిమాలో తొలిసారిగా బిగ్ బి!

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా రిలీజైన కబాలికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు బ్రహ్మరథం పడుతుంటే.. ఈ సినిమాను ప్రస్తుతం బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్ వస్తోంది. ఉత్తరాది

Advertiesment
Exclusive
, మంగళవారం, 26 జులై 2016 (16:40 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా రిలీజైన కబాలికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు బ్రహ్మరథం పడుతుంటే.. ఈ సినిమాను ప్రస్తుతం బాలీవుడ్‌లో  రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్ వస్తోంది. ఉత్తరాది మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కబాలి రీమేక్‌లో నటింపజేసేందుకు దర్శకులు క్యూ కడుతున్నారట. అదే కనుక జరిగితే చాలాకాలం తర్వాత అమితాబ్ ఓ ఫుల్ లెంగ్త్ మూవీలో నటించినట్లవుతుంది. 
 
కాగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కబాలి ఫీవర్ నడుస్తోంది. ర‌జ‌నీకాంత్ మానీయాతో భారీ క‌లక్ష‌న్స్ దిశ‌గా కబాలి దూసుకుపోతోంది. ఈ సినిమాకి పా రంజిత్ ద‌ర్శ‌కుడు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో రీమేక్ కానున్న కబాలిగా అమితాబ్ నటించబోతున్నారని వార్తలు రావడంతో ఆయన ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. ఇప్పటికే తమిళంలో వేలైక్కారన్, బిల్లా పేరిట రీమేక్ అయిన అమితాబ్ సినిమాల్లో రజనీకాంత్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. 
 
అయితే తొలిసారిగా స్నేహితుడు ప్లస్ సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ సినిమాను అమితాబ్ హిందీలో రీమేక్ చేయనున్నారు. రజనీకాంత్ కబాలి హిందీలో డబ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ సాధించలేకపోయింది. దీంతో అమితాబ్ ఆ సినిమాను రీమేక్ చేయాలని.. తద్వారా కబాలికి మరో గుర్తింపు సాధించి పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృష్ణజింకల కేసు- సల్మాన్ నిర్దోషి.. రామ్ గోపాల్ వర్మ ఏమన్నారో తెలుసా?