నీ కోసం కూడా ఇలాంటి చీరే తయారు చేయిద్దాం.. రకుల్ ప్రీత్ సింగ్‌తో సమంత
హీరోయిన్ సమంత ఆదివారం రాత్రి జరిగిన తన నిశ్చితార్థం వేడుకలో బంగారు వర్ణం అంచు కలిగిన తెలుపు చీరలో మెరిసిపోయింది. ముంబైకి చెందిన డిజైనర్ క్రేషా బజాజ్ డిజైన్ చేసిన ఈ చీరకు ప్రత్యేక స్టోరీ ఉంది. నిశ్చ
హీరోయిన్ సమంత ఆదివారం రాత్రి జరిగిన తన నిశ్చితార్థం వేడుకలో బంగారు వర్ణం అంచు కలిగిన తెలుపు చీరలో మెరిసిపోయింది. ముంబైకి చెందిన డిజైనర్ క్రేషా బజాజ్ డిజైన్ చేసిన ఈ చీరకు ప్రత్యేక స్టోరీ ఉంది. నిశ్చితార్థ వేడుకలో సమంత కట్టిన చీర ఆమె ప్రేమకథను, చైతూపై ఆమెకున్న ప్రేమను తెలుపుతోంది.
సమంత చీర అంచును బాగా గమనిస్తే.. అందులో 'ఏమాయ చేసావె' చిత్రంలోని ఓ సన్నివేశం నుంచి మొన్నమొన్న జరిగిన అఖిల్ నిశ్చితార్థంలో దిగిన ఫ్యామిలీ ఫొటో వరకు దృశ్యాలు కనిపిస్తాయి. బైక్‌పై సమంత, చైతన్య కలిసి ఉన్న చిత్రం కూడా కనిపిస్తుంది. ఇటీవల సమంత తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ఈ చీరను డిజైన్ చేస్తుండగా తీసినట్లుగా తెలుస్తోంది.
ఈ చీరపై సోషల్ మీడియాలో చర్చ బాగానే జరిగింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కథానాయికలు సమంత, రకుల్‌ప్రీత్ సింగ్ ట్విటర్ వేదికగా సరదాగా మాట్లాడుకున్నారు. సమంత తన నిశ్చితార్థం వేడుకలో ప్రత్యేకంగా తయారు చేయించిన చీరలో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించారు.
చిన్నతనం నుంచి ఇప్పటి వరకు జరిగిన మధురమైన సంఘటనలను గుర్తుకు తెస్తూ డిజైన్ చేయించిన ఈ చీరను చూపిస్తున్న ఒక వీడియోను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనికి రకుల్‌ప్రీత్ చీర చాలా నచ్చిందని ట్వీట్ చేశారు. వెంటనే సమంత స్పందిస్తూ.. 'నీ కోసం కూడా మనం ఇలాంటిదే తయారు చేయిద్దాం' అని నవ్వుతూ ట్వీట్ చేశారు. మరి రకుల్ వూరుకుంటారా.. 'సమంత.. ఎప్పుడైనా, ఎక్కడైనా..' అని సిగ్గుపడుతూ బదులిచ్చారు.