Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మలేరియా బారినపడిన ఇమ్రాన్ హష్మి...

బాలీవుడ్‌ హీరో హీరో ఇమ్రాన్‌ హష్మి మలేరియా వ్యాధి బారినపడ్డాడు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్‌‍లో చికిత్స పొందుతున్నాడు. ఇమ్రాన్ తాజా చిత్రం ''రాజ్‌ రీబూట్'' విడుదలకు సిద్ధంగా ఉంది. ''రాజ్‌ రీబూట్‌'' సినిమా

Advertiesment
Emraan Hashmi
, శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (09:45 IST)
బాలీవుడ్‌ హీరో హీరో ఇమ్రాన్‌ హష్మి మలేరియా వ్యాధి బారినపడ్డాడు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్‌‍లో చికిత్స పొందుతున్నాడు. ఇమ్రాన్ తాజా చిత్రం ''రాజ్‌ రీబూట్'' విడుదలకు సిద్ధంగా ఉంది. ''రాజ్‌ రీబూట్‌'' సినిమా విషయానికి వస్తే.. రాజ్ సిరీస్‌లో వస్తున్న చివరి సినిమా ఇది. ఈ సిరీస్‌లో వచ్చిన చిత్రాలన్నీ దాదాపుగా ప్రేక్షకుల్ని అలరించాయి. ఈ సిరీస్‌ పట్ల ఆడియన్స్‌లో ప్రత్యేకమైన క్రేజ్‌ ఏర్పడింది. 
 
ఈ చిత్రంలో కృతి కర్బంద హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ హీరోకి జ్వరం తగ్గే వరకు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు ఆయనకు సూచించారు. దీంతో.. తన తాజా చిత్రం ''రాజ్ రీబూట్'' ప్రచార కార్యక్రమంలో ఇమ్రాన్ హష్మీ పాల్గొనడం లేదన్న విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు చెప్పారు. 
 
కాగా, విక్రమ్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన ''రాజ్ రీబూట్'' చిత్రం యూనిట్ మూడు రోజుల క్రితం జైపూర్లో ప్రచార కార్యక్రమం నిర్వహించింది. ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఇమ్రాన్ హష్మీ జ్వరం కారణంగా తిరిగి ముంబైకి వెళ్లిపోయాడు. మిగిలిన యూనిట్ సభ్యులు అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకుంటారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ జన్మదినం ఎప్పటికీ మరచిపోలేను : సీనియర్ నటి రమ్యకృష్ణ