Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏం చేస్తున్నావ్! నా జీవితంలో ఎక్కువగా విన్న డైలాగ్ ఇదే : శ్రీ విష్ణు

Advertiesment
Srivishnu
, శనివారం, 12 ఆగస్టు 2023 (11:50 IST)
Srivishnu
ఏం చేస్తున్నావ్ నా జీవితంలో ఎక్కువగా ఉన్న ప్రశ్న ఇదే అని హీరో శ్రీ విష్ణు అన్నారు. ఏం చేస్తున్నావ్ అనే పాదంలో  చాలా అర్థాలు ఉంటాయని, ఇది చాలా మంచి టైటిల్ అని టీజర్ కూడా బాగుందన్నారు. గోపి సుందర్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుందని సాంగ్స్ చాలా బాగున్నాయి అన్నారు. ఈ సినిమా వేడుక చూస్తుంటే తనకు బ్రోచేవారెవరు, మెంటల్ మదిలో సినిమాలు గుర్తుకొస్తున్నాయని.. కొత్త వాళ్ళందరూ ఇలానే ఎదుగుతారని వారి థాట్స్, వారి మాటలు చాలా ఫ్రెష్ గా ఉంటాయి అన్నారు.
 
webdunia
emi chestunnaav Teaser function
NVR ప్రొడక్షన్, SIDS క్రియేటివ్ వరల్డ్ బ్యానర్లపై నవీన్ కురవ, కిరణ్ కురవ సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం 'ఏం చేస్తున్నావ్'. భరత్ మిత్ర దర్శకత్వంలో విజయ్ రాజ్ కుమార్, నేహా పఠాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మెలోడీ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సంగీత సారధ్యంలో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటలు ఇప్పటికే విడుదలై శ్రోతల్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీజర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ, అలాగే ఇండస్ట్రీలో ఎప్పుడు కొత్తవాళ్లు విజయం సాధించాలని, కొత్తవాళ్లు సక్సెస్ అయితే తనకు సంతోషమని అన్నారు. చిన్న సినిమాలకు ప్రమోషన్స్ కొంచెం కష్టం, కానీ మీడియా సపోర్ట్ చేస్తే అదేమంత కష్టం కాదని తనకు సపోర్ట్ చేసినట్లే 'ఏం చేస్తున్నావ్' చిత్ర యూనిట్ కు కూడా మీడియా సపోర్ట్ చేయాలని కోరారు. డైరెక్టర్ భరత్ కు మంచి విజన్ ఉందని, మంచి స్టోరీ టెల్లర్ అవుతారని.. అలాగే హీరో కూడా విజయం సాధించాలని కోరుతూ ఆగస్టు 25న అందరూ తప్పకుండా థియేటర్లో ఏం చేస్తున్నావ్ చిత్రం చూడాలని టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
 
డైరెక్టర్ భరత్ మిత్ర మాట్లాడుతూ, ఈ సినిమా 18- 30 వయసు గల వారికి బాగా కనెక్ట్ అవుతుందని మంచి సినిమా తీశామని చెప్పారు థియేటర్లోకి ఎంతమంది వచ్చినా.. వచ్చినవారు కచ్చితంగా మంచి అనుభూతితో థియేటర్ నుండి బయటకి వెళ్తారని తెలిపారు.
 
పాటల రచయిత భరద్వాజ్ మాట్లాడుతూ, శ్రీ విష్ణు హీరోగా బ్రోచేవారెవరు చిత్రానికి రచయితగా పనిచేయడం, మళ్ళీ ఇన్నాళ్ళకి శ్రీ విష్ణు ముఖ్యఅతిథిగా వచ్చిన ఏం చేస్తున్నావు చిత్రానికి కూడా లిరిక్స్ రాయడం చాలా సంతోషంగా ఉందన్నారు. పాటలు చాలా బాగున్నాయి సినిమా కూడా చాలా బాగుంటుంది అని తెలిపారు. డైరెక్టర్ భరత్, నేను  షార్ట్ ఫిలిమ్స్  కలిసి స్క్రిప్టులు రాశాం. యూట్యూబ్ లో భరత్ తీసిన 'ఇండియాస్ డాటర్' షార్ట్ ఫిలింకు అప్పట్లోనే 5 మిలియన్స్ పైగా వ్యూస్ వచ్చాయి అన్నారు.
 
ఇంకా నటుడు మధు, అశోక్, నటి సాయి ప్రసన్న, శ్రీధర్ రెడ్డి, బాంధవి శ్రీధర్, నిర్మాత కిరణ్ కురువ తదితరులు మాట్లాడారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జైలర్ రోల్ కోసం బాలకృష్ణను అనుకున్నా.. అది జరగలేదు..