Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిగ్ స్క్రీన్ పైన దేవీశ్రీ

వెండితెరపై దేవీశ్రీ ప్రసాద్‌ని చూపించాలని ఎన్నాళ్ళుగానో కొందరు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఐతే వాటన్నిటినీ సున్నితంగా తిరస్కరించిన ఈ రాక్‌స్టార్ తన స్నేహితుడు దర్శకుడు సుకుమార్‌ కథకు మాత్రం ఓకే చెప్పినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ సినిమా ఈ ఏ

బిగ్ స్క్రీన్ పైన దేవీశ్రీ
, బుధవారం, 3 ఆగస్టు 2016 (20:27 IST)
వెండితెరపై దేవీశ్రీ ప్రసాద్‌ని చూపించాలని ఎన్నాళ్ళుగానో కొందరు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఐతే వాటన్నిటినీ సున్నితంగా తిరస్కరించిన ఈ రాక్‌స్టార్ తన స్నేహితుడు దర్శకుడు సుకుమార్‌ కథకు మాత్రం ఓకే చెప్పినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ సినిమా ఈ ఏడాదిలోనే పట్టాలెక్కతుందని ప్రచారం జరిగినా ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. సినిమా సంగతెలా ఉన్నా దేవీ త్వరలో బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనున్నాడన్నది అసలు విషయం. 
 
కొద్దికాలం క్రితం అంటే 2014 ద్వితీయార్థంలో దేవీ అమెరికా టూర్‌ వెళ్ళిన సంగతి తెలిసిందే. టూరంటే తిరిగొచ్చేసే టూర్ కాదు. అక్కడ పెర్ఫార్మ్ చేయటానికి. ఈ కార్యక్రమ ప్రచారానికి అప్పట్లో దక్షిణాది తారలైన కమల్ హాసన్, విజయ్, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌లు తరలివచ్చారు. జులై 6 2014 నుండి ఆగస్ట్ 2 2014 వరకు అట్లాంట, చికాగో, డల్లాస్ వంటి ఏడు కేంద్రాల్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని వీడియో రూపంలో బయటకు తీసుకొస్తున్నట్టు ‘కుమారి 21f’ ప్రచార సమయంలో చెప్పుకొచ్చాడు దేవీ. 
 
ఆ వ్యవహారం ఇప్పుడు కొలిక్కి వచ్చినట్టుంది. ఈ నెల 6న హైదరాబాద్‌లోని ఐమాక్స్‌లో ఆ కార్యక్రమం ప్రదర్శితం కానున్నట్టు దేవీ వెల్లడించారు. దీనికి లేటెస్ట్ సౌండ్ టెక్నాలజీ అయిన డాల్బీ అట్మాస్‌ని జోడించినట్టు తెలిపిన ఆయన ఈ తరహా ప్రదర్శనల్లో ఇదే ప్రప్రథమం అని పేర్కొనడం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూనియర్‌ ఆర్టిస్టులకు ఏం జరుగుతోంది? సినీ ఇండస్ట్రీలో మోసం ఎలా వుంది?