Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంజలి ప్రియుడు జై పెద్ద తాగుబోతా ఏమిటి...? మళ్లీ పోలీసులకి చిక్కాడు

తమిళ నటుడు జై గత యేడాది సెప్టెంబర్‌లో మద్యం తాగి కారు నడుపుతూ అడయార్ బ్రిడ్జి సమీపంలోని గోడను ఢీకొట్టడంతో ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ కేసులో అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆరు నెలలపాటు రద్దుచేశారు. అంతకుముందు 2014లో కేకే నగర్ సమ

Advertiesment
drunk and drive
, గురువారం, 28 జూన్ 2018 (11:53 IST)
తమిళ నటుడు జై గత యేడాది సెప్టెంబర్‌లో మద్యం తాగి కారు నడుపుతూ అడయార్ బ్రిడ్జి సమీపంలోని గోడను ఢీకొట్టడంతో ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ కేసులో అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆరు నెలలపాటు రద్దుచేశారు. అంతకుముందు 2014లో కేకే నగర్ సమీపంలోని కాశీ థియేటర్‌ సమీపంలో కూడా మద్యం మత్తులో ట్రాఫిక్ వాహనాన్ని ఢీకొట్టాడు. ఇప్పుడు మళ్లీ మరోసారి చెన్నైలో రోడ్డుపై మద్యం మత్తులో కారు నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు.
 
మంగళవారం రాత్రి నుంగంబాక్కమ్ మెయిన్ రోడ్డులో మద్యం మత్తులో జోగుతూ కారును నడుపుకుంటూ వేగంగా వెళుతూ పెద్ద పెద్ద శబ్దాలతో హారన్‌ను మోగించాడట. దీంతో ఇతర ప్రయాణికులు హడలిపోయారు. అతను వెళ్లే దారిలో ఆసుపత్రి ఉన్నదని ఆలోచించికుండా హారన్‌ను సైరన్‌లా శబ్దం చేసుకుంటూ వెళ్లాడు. ఈ విషయం గమనించిన పోలీసులు జైను వెంబడించి అతనిని అదుపులోనికి తీసుకున్నారు. ఇకపై ఇలాంటివి చేయనని క్షమాపణలను కోరగా పోలీసులు అతనిని హెచ్చరించి వదిలేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ష‌క‌ల‌క శంక‌ర్‌కి ఏమైంది..?