Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీడియా నాశనం చేసింది... ఇప్పుడు అప్పుడు ఎప్పుడూ అంతేకదా...(వీడియో)

పూరీ జగన్నాథ్ చాలా ఫీలయ్యారు. రేటింగ్స్ కోసం మీడియా తన జీవితాన్ని నాశనం చేసిందని వాపోయారు. హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ దందాలో పూరీ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో సిట్ బృందం ఎదుట పూరీ హాజరయ్యారు. మొత్తం 11 గంటల పాటుసాగిన విచారణ అనంతరం పూర

Advertiesment
మీడియా నాశనం చేసింది... ఇప్పుడు అప్పుడు ఎప్పుడూ అంతేకదా...(వీడియో)
, గురువారం, 20 జులై 2017 (20:48 IST)
పూరీ జగన్నాథ్ చాలా ఫీలయ్యారు. రేటింగ్స్ కోసం మీడియా తన జీవితాన్ని నాశనం చేసిందని వాపోయారు. హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ దందాలో పూరీ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో సిట్ బృందం ఎదుట పూరీ హాజరయ్యారు. మొత్తం 11 గంటల పాటుసాగిన విచారణ అనంతరం పూరీని సిట్ బృందం అధికారులు వదిలిపెట్టారు. 
 
అనంతరం పూరీ జగన్నాథ్ తన ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో పూరీ పలు విషయాలను చెప్పుకొచ్చారు. సిట్ విచారణకు వెళ్లానని, వారికి పూర్తిగా సహకరించానని చెప్పుకొచ్చారు. సమాజంలో తానెంతో బాధ్యత కలిగిన వ్యక్తినని, పోలీసులు, మీడియా అంటే తనకెంతో ఇష్టమని పూరీ వెల్లడించారు. పోలీసులపై తాను ఎన్నో సినిమాలు తీశానని, జర్నలిస్టుల కోసం ఇజం సినిమా తీశానని చెప్పారు.
 
కానీ, మీడియా తన విషయంలో ప్రవర్తించిన తీరు తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందన్నారు. మీడియా రేటింగ్స్ కోసం కట్టు కథలు అల్లి ప్రోగ్రామ్స్ చేసిందని.. వాటి వల్ల తన కుటుంబం బాధతో కుమిలిపోతోందని వాపోయారు. ఈ విషయంలో తాను కూడా ఎంతో బాధపడుతున్నట్లు తెలిపారు. నిజంగా చెప్పాలంటే మీడియా జీవితాలను నాశనం చేసిందని పూరీ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా చేసిన పని వల్ల తాను మాత్రమే కాదని, ఎంతోమంది జీవితాలు నాశనమయ్యాయని పూరీ చెప్పుకొచ్చారు. 
 
పైగా, తప్పుడు పనులను తాను ప్రోత్సహించనని పూరీ జగన్నాథ్ అన్నారు. కెల్విన్‌ గ్యాంగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. నాపై ఉన్న ఆరోపణలకు సరైన సమాధానం ఇచ్చినట్టు తెలిపారు. సిట్‌ అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని పూరీ జగన్నాథ్ తెలిపారు. ఆయన మాటల్లోనే చూడండి ఈ వీడియోను...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అబ్బే లాభంలేదు రాజా... ఎన్టీఆర్‌ని, బిగ్ బాస్‌ని ఆదుకునేదెవరు రాజా? రేష్మీనా?