Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టాలీవుడ్ షేకింగ్... కాజల్ అగర్వాల్ మేనేజర్ రోనీ అరెస్ట్... ఏం జరుగుతోంది...?

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో షేక్ అవుతోంది. రోజుకో వ్యక్తి పేరు బయటకు వస్తోంది. తాజాగా టాలీవుడ్ అగ్రనటి కాజల్ అగర్వార్ మేనేజర్ రోని అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దీనితోపాటు అతడి ఇంట్లో గంజాయిని కూ

టాలీవుడ్ షేకింగ్... కాజల్ అగర్వాల్ మేనేజర్ రోనీ అరెస్ట్... ఏం జరుగుతోంది...?
, సోమవారం, 24 జులై 2017 (17:25 IST)
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో షేక్ అవుతోంది. రోజుకో వ్యక్తి పేరు బయటకు వస్తోంది. తాజాగా టాలీవుడ్ అగ్రనటి కాజల్ అగర్వార్ మేనేజర్ రోని అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దీనితోపాటు అతడి ఇంట్లో గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి కాజర్ అగర్వాల్ మేనేజర్ కావడంతో ఆమెకు కూడా దీనితో ఏమయినా లింకులు వున్నాయేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ రోనీ అనే వ్యక్తి గతంలో నటి రాశీఖన్నా, లావణ్య త్రిపాఠిలకు కూడా మేనేజర్‌గా పనిచేయడం జరిగింది.
 
మరోవైపు డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురు సినీ సెలబ్రిటీలను సిట్ విచారించింది. ఇవాళ హీరో నవదీప్‌ను విచారిస్తోంది. ఇదిలావుండగా నటి చార్మి సిట్ విచారణకు సహకరిస్తానంటూనే హైకోర్టును ఆశ్రయించారు. ఆర్టికల్ 20 సబ్ క్లాజ్ 3 ప్రకారం బలవంతంగా రక్త నమూనాలను సేకరించకూడదని ఆమె తరపు న్యాయవాది పిటీషన్లో పేర్కొన్నారు. 
 
ఇంకా చార్మి పిటీషన్లో... తను ఇప్పటివరకూ దక్షిణాది చిత్రాలతో పాటు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తోనూ నటించానని తెలిపింది. తను గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చాననీ, ఐతే సిట్ జరుపుతున్న విచారణ తీరు అభ్యంతరకరంగా వుందంటూ ఆమె పేర్కొన్నారు. ఈ కేసు కారణంగా తన కెరీర్‌కు డ్యామేజ్ అయ్యే అవకాశం వున్నదంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 
 
అందువల్ల తనను విచారించే సమయంలో తన తరపు న్యాయవాదిని కూడా అనుమతించాలంటూ ఆమె పిటీషన్లో పేర్కొన్నారు. చార్మి పిటీషన్ నేపధ్యంలో సిట్ అధికారులు ప్రభుత్వ న్యాయవాదులతో చర్చిస్తున్నారు. వారి సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైరు చార్మి పిటీషన్ మంగళవారం నాడు కోర్టు విచారణకు రానుంది. డ్రగ్స్ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వీడియోలో చూడండి..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాహోలో 3 విలన్లు: రేసులో అరవింద్ సామి- ప్రభాస్‌తో నటించాలా? 2 నెలల టైమ్ కావాలన్న దేవసేన