మళ్లీ హారర్ సినిమాలో నయనతార.. డోర టైటిల్ ఖరారు..కారుకు ఎదురుగా?
దక్షిణాది టాప్ హీరోయిన్ నయనతార మళ్లీ హారర్ సినిమాలో నటించేందుకు రెడీ అవుతోంది. మయూరి తర్వాత ఆమె నటిస్తున్న మరో హారర్ చిత్రమిది. నయనతార ప్రధానలో మరో హారర్ చిత్రం రూపొందుతుంది.
దక్షిణాది టాప్ హీరోయిన్ నయనతార మళ్లీ హారర్ సినిమాలో నటించేందుకు రెడీ అవుతోంది. మయూరి తర్వాత ఆమె నటిస్తున్న మరో హారర్ చిత్రమిది. నయనతార ప్రధానలో మరో హారర్ చిత్రం రూపొందుతుంది.
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి "డోర'' అనే టైటిల్ పెట్టారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్‌లో చీకటిలో ఓ కారుకుగా ఎదురుగా నిలుచుని ఉన్న దృశ్యాన్ని వెనుక నుంచి చూపించారు. అయితే పైన ఆకాశంలో ఓ వింత ఆకారం భయపెడుతోంది.
ఇప్పటి వరకు వచ్చిన హారర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఓ వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని చిత్ర యూనిట్ చెబుతోంది. మురగదాసు రామస్వామి ఈ చిత్రానికి దర్శకుడు. చిత్రానికి వివేక్ మ్యూజిక్ అందిస్తున్నాడు.