Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇది చూస్తే పిచ్చిబట్టినట్లు పగలబడి నవ్వుకోవాల్సిందే... వార్నాయనోయ్... ఏం పిచ్చి?

చిరంజీవి చిత్రం ఖైదీ నెం. 150 చిత్రాన్ని అమెరికా దేశానికి కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చూశారట. చూడటమే కాదు ఆ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారట. ట్విట్టర్లో ట్రంప్ ఏమన్నారంటే... ‘ఇప్పుడే చిరంజీవితో ఫోన్లో మాట్లాడాను. ఆయన గొప్ప మనిషి. ఖైదీ

Advertiesment
Donald trump tweets
, సోమవారం, 16 జనవరి 2017 (16:51 IST)
చిరంజీవి చిత్రం ఖైదీ నెం. 150 చిత్రాన్ని అమెరికా దేశానికి కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చూశారట. చూడటమే కాదు ఆ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారట. ట్విట్టర్లో ట్రంప్ ఏమన్నారంటే... ‘ఇప్పుడే చిరంజీవితో ఫోన్లో మాట్లాడాను. ఆయన గొప్ప మనిషి. ఖైదీ నెం. 150 చాలా మంచి సినిమా. ఈ సినిమాను నా భార్య మెలానియా, కుమార్తె ఇవాంకాతో కలిసి ఎంజాయ్ చేశా. బాస్ ఈజ్ బ్యాక్’ అని ట్రంప్ ట్వీటినట్లు సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో దర్శనమిస్తోంది. 
 
ఐతే ఇది నిజమేనా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. డోనాల్డ్ ట్రంప్ చిరంజీవి చిత్రాన్ని చూసింది లేదు... ఆయనా ట్విట్టర్లో పోస్ట్ చేసిందీ లేదు.  మెగాస్టార్ చిరంజీవిని పిచ్చిగా అభిమానించే ఓ ఫ్యాన్ ఇలా తయారుచేసి ట్విట్టర్లో వదిలాడు. ఈ ట్విట్టర్ నిజమేనని చాలామంది ఈ వార్తను షేర్ చేస్తూ తెగ ఖుషీ చేసుకుంటున్నారు. కానీ నిజం తెలిసి అవాక్కవుతున్నారు. అభిమానం వుండవచ్చు కానీ మరీ ఇంత వెర్రి అభిమానం వుంటే అది నటులకు ఇబ్బందులను తీసుకొస్తుంది. పరువు కూడా తీస్తుందని తెలుసుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా కుమారులు తప్పు చేస్తే వారి తలలు నరికేస్తా: షారూఖ్ ఖాన్