Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రభాస్ ను రాజాసాబ్ తో దర్శకుడు మారుతీ ఏవిధంగా చూపిస్తున్నాడో తెలుసా

Prabhas, maruti at shooting

డీవీ

, మంగళవారం, 8 అక్టోబరు 2024 (16:36 IST)
Prabhas, maruti at shooting
ఇప్పటివరకు యాక్షన్ హీరోగా అప్పుడప్పుడు సన్నివేశపరంగా వినోదం కలిగే చిత్రాల్లో నటించిన రెబల్ స్టార్ ప్రభాస్ ను పూర్తి వినోదాత్మకంగా చూపేలా ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు మారుతీ. ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ చిత్రం కథేమిటో ఇప్పటికీ పెద్దగా తెలీదు. ఇప్పటికే షూటింగ్ మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. నేడు దర్శకుడు మారుతీ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిన్న గ్లింప్స్ ను విడుదల చేశారు.
 
ఇందులో దర్శకుడు సన్నివేశాలను ఎలా తీస్తున్నాడో వంటివి కొన్ని షాట్స్ చూపిస్తూ చివరిలో మేనిటర్ చూస్తూ మారుతీ భుజంపై చేయివేస్తూ హ్యాపీగా నవ్వుతున్న ప్రభాస్ ను చూపించాడు. మెరుపుతీగలా సాగే ఈ గ్లింప్స్ తన బర్త్ డే సందర్భంగా విడుదల చేయాలని భావించారు. గతంలో ప్రభాస్ కూడా తాను మాస్ యాక్షన్ పాత్రలు చేసి కాస్త రిలీఫ్ గా వినోదభరిత చిత్రం చేయాలనుందని ఆదిపురుష్ తర్వాత స్టేట్ మెంట్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత సలార్ తో యాక్షన్ సినిమా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రభాస్ ను పూర్తి వినోదభరిత చిత్రంలో మారుతీ చూపించనున్నాడు. ఈ సినిమా అభిమానులందరికీ ప్రత్యేక డార్లింగ్ ట్రీట్‌తో పేలుడు వినోదం వస్తోంది అంటూ తెలియజేశారు. ఈ సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
 
ప్రభాస్, మాళవిక  మోహనన్, నిధి అగర్వాల్, యోగిబాబు, సంజయ్ దత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బేనర్ పై  విశ్వప్రసాద్ టిజి  నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. యాక్షన్ కొరియోగ్రఫీని రామ్ లక్ష్మణ్, సోలమన్,  ఆర్ సి కమలకన్నన్, సహనిర్మాత వివేక్ కూచిబొట్ల.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసు : నాంపల్లి కోర్టులో నాగార్జున వాంగ్మూలం