Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"డీజే"కు తప్పని చిక్కులు: మళ్లీ సీన్లోకి బ్రాహ్మణ సంఘాలు.. నమక, చమకాలను శృంగారపరంగా ప్రస్తావిస్తారా?

డీజేకు వివాదాలతో చిక్కులు తప్పట్లేదు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న దువ్వాడ జగన్నాథం సినిమా పాటపై బ్రాహ్మణులు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. డీ

, మంగళవారం, 13 జూన్ 2017 (18:03 IST)
డీజేకు వివాదాలతో చిక్కులు తప్పట్లేదు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న దువ్వాడ జగన్నాథం సినిమా పాటపై బ్రాహ్మణులు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. డీజేలోని రెండో పాట సాహితి రాసిన ‘గుడిలో బడిలో మడిలో ఒడిలో’... ‘అస్మైక యోగ తస్మైక భోగ’ అనే పాటపై త‌లెత్తిన వివాదం ఇంకా ముగియలేదు. ఈ పాటలోని అభ్యంతరకర పదాలను తొలగిస్తానని హామీ ఇచ్చిన హరీష్ చెప్పిన మాటను నిలబెట్టుకోలేదని బ్రాహ్మణ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. 
 
ఆ పాట‌లోని "ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం.. ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం'' అంటూ హీరోయిన్‌ని వ‌ర్ణించ‌డం ప‌ట్ల బ్రాహ్మ‌ణ సంఘాలు ఇప్ప‌టికే ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం చేసి, హ‌రీశ్ శంక‌ర్‌ను క‌లిశారు. హరీశ్ కూడా అగ్రహారం, తమలపాకు వంటి పదాలను తొలగిస్తామని మాటిచ్చారు. కానీ ఆ పదాలను తొలగించకుండానే హరీష్ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నారని బ్రాహ్మణ సంఘాలు తెలిపాయి. ఈ విష‌యంపై బ్రాహ్మ‌ణ సంఘాల స‌భ్యులు మంగళవారం తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌ను క‌లిసి ఫిర్యాదు చేశారు. 
 
దర్శకుడు హ‌రీశ్ శంక‌ర్ త‌మ‌ను ఇంత మోసం చేస్తాడా? అంటూ బ్రాహ్మణ సంఘాల స‌భ్యులు మండిపడుతున్నారు. శివుడికి ప్రీతికరమైన నమక, చమకాలను శృంగారపరంగా ప్రస్తావించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాము ఇదే అంశంపై సెన్సార్ బోర్డుకి కూడా వెళ్లామ‌ని చెప్పారు. వారు కూడా స‌రిగా స్పందించ‌క‌పోతే వారి మీద కూడా న్యాయ పోరాటం చేయ‌డానికి సిద్ధంగా ఉన్నట్లు బ్రాహ్మణ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''సంఘమిత్ర'' నుంచి శ్రుతిహాసన్ బ్రేకప్ అందుకేనా? సెట్స్‌పైకి వెళ్తుందా?