Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హరీష్ నోటి దూలతో బన్నీకి దెబ్బేస్తున్నాడా...?

దువ్వాడ జగన్నాథం చిత్రం ఆది నుంచి విమర్శల్లో కూరుకుంది. తమను కించపరిచే మాటలు తీసేయాల్సిందే బ్రాహ్మణ సంఘాలు ఆందోళన చేయడంతో వాటిని తీసేయక తప్పింది కాదు. ఆ సందర్భంలో మీడియా అడిగిన ప్రశ్నలకు దర్శకుడు హరీశ్ శంకర్ ఓ రేంజిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక చిత్రం

Advertiesment
హరీష్ నోటి దూలతో బన్నీకి దెబ్బేస్తున్నాడా...?
, శుక్రవారం, 7 జులై 2017 (18:37 IST)
దువ్వాడ జగన్నాథం చిత్రం ఆది నుంచి విమర్శల్లో కూరుకుంది. తమను కించపరిచే మాటలు తీసేయాల్సిందే బ్రాహ్మణ సంఘాలు ఆందోళన చేయడంతో వాటిని తీసేయక తప్పింది కాదు. ఆ సందర్భంలో మీడియా అడిగిన ప్రశ్నలకు దర్శకుడు హరీశ్ శంకర్ ఓ రేంజిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక చిత్రం విడుదలయ్యాక కూడా డీజె డైరెక్టరు మళ్లీ ఫైర్ అయ్యాడు. 
 
ఈసారి చిత్రం సమీక్షలు సరిగా రాయలేదనీ, అందువల్లనే ఓవర్సీస్ కలెక్షన్లు తగ్గాయంటూ ఆరోపించారు. అంతేకాదు... నైజాం ఏరియాలో డీజె కలెక్షన్లు అంతగా రాబట్టలేదని కొంతమంది రాస్తే.... రూ. 20 కోట్లు కొల్లగొట్టిందనీ, అది అవాస్తవమని నిరూపిస్తే తను సినిమాలు చెయ్యడమే మానేస్తానంటూ సవాల్ విసిరారు. 
 
ఇప్పుడు ఓవర్సీస్ కలెక్షన్లు తగ్గడానికి కూడా మీడియానే కారణమని వారిని దుమ్మెత్తి పోస్తున్నాడు. ఐతే మౌత్ టాక్ అనుసరించి చిత్ర సమీక్షలుంటాయనేది తెలిసిందే. ఇంకా... చిత్రంలో దమ్ముంటే ఎంతమంది ఏమనుకున్నా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని బాహుబలి చిత్రం రుజువు చేసిందన్నది తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా పోస్ట్‌కే ఎసరుపెట్టేట్టున్నారే...? స్టేజిపై యాంకర్ ఉదయభాను...