Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాల్డ్ డిస్నీకి కష్టాలొచ్చాయా? మొహంజదారోతో దిమ్మ దిరిగింది

వాల్డ్ డిస్నీకి కష్టాలు వచ్చాయా? ఆ కష్టాలన్నీ మొహంజదారో సినిమాతోనేనా అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ జనం. వాల్ట్‌ డిస్నీ సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని ప్రొడక్షన్ హౌజ్. వాల్డ్‌ డిస్నీ ఇప

Advertiesment
వాల్డ్ డిస్నీకి కష్టాలొచ్చాయా? మొహంజదారోతో దిమ్మ దిరిగింది
, గురువారం, 8 సెప్టెంబరు 2016 (15:06 IST)
వాల్డ్ డిస్నీకి కష్టాలు వచ్చాయా? ఆ కష్టాలన్నీ మొహంజదారో సినిమాతోనేనా అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ జనం. వాల్ట్‌ డిస్నీ సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని ప్రొడక్షన్ హౌజ్. వాల్డ్‌ డిస్నీ ఇప్పటి వరకూ ఎన్నో సినిమా తీసింది. ఇప్పటి వరకూ లాభాలుతప్ప నష్టాలు కళ్ళచూడని ఈ సంస్థకు మొదటి సారి దిమ్మతిరిగే ఎదురు దెబ్బ తగిలిందట. 
 
''మొహంజోదారో" సినిమాను యూటీవీ భాగస్వామ్యంతో హక్కులు కొనుగోలు చేసి విడుదల చేసిన ఈ సంస్థకు భారీ నష్టంతో చుక్కలు కనిపించాయట. గతంలో విడుదల చేసిన సినిమాలో ఏదో విధంగా పెట్టుబడి తిరిగి ఇచ్చేసినా ఈ సినిమా మాత్రం పెద్ద షాకే ఇచ్చింది. దాంతో భారతీయ సినిమాలకు టాటా చెప్పేయాలన్న నిర్ణయానికి వచ్చిందట.

ఈ ప్రక్రియ డిసెంబరు నాటికి పూర్తవుతుందని సినీ వర్గాల్లో టాక్. మొహంజదారో కోసం రూ.125 కోట్లు బడ్జెట్ పెట్టగా రూ. 50 కోట్లు రాబడి రాగా, రూ. 75కోట్ల నష్టం ఏర్పడిందని సినీ పండితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమలాపాల్, త్రిషలను తెగ వాడేసుకుంటున్న ధనుష్.. చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారట