Sivajiraja, A. Kodandaramireddy, veena
ఎన్.టి.ఆర్. ఎ.ఎన్.ఆర్. కాలంనుంచి దర్శకుడిగా వుంటూ పలు విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన వీరమాచనేని మధుసూధనరావు శతజయంతి ఉత్సవాన్ని జరపనున్నారు. వచ్చేనెల 11న ఈ వేడుకను హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించనున్నట్లు ఆయన కుమార్తె వీణ తెలిపారు. సోమవారంనాడు ఫిలింఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో వి. మధుసూదనరావు శిష్యులు ఎ. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ, అలనాటి విషయాలను గుర్తు చేశారు.
శివాజీరాజా మాట్లాడుతూ, మధుఫిలిం ఇనిస్టిట్యూట్‌లో మేం మొదటి బ్యాచ్. అందులో చాలామంది నటులు అయ్యాం. నాకు కళ్ళు అనే మాట పలకడం రాదు. దానికోసం నాలుగు రోజులుపాటు ప్రాక్టీస్ చేయించి పట్టుదలతో నన్ను నటుడిగా పరిచయం చేశారు. అదే అవేకళ్ళు సినిమా. ఆయన అభ్యుదయభావాలు గల దర్శకుడు. తెలుగులో అలాంటివారు అరుదు. కమ్యూనిస్టుగా సినీరంగంలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఆయన దాన్ని సాధించుకున్నారు. ఆయన 100వ జయంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా వుందని తెలిపారు.