రజనీ వ్యక్తిత్వం విశిష్టమైనది.. ఇప్పటికీ ఆ పూరి గుడిసె ఎందుకుంటుందో తెలుసా?
సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులను కలుస్తున్నారు. వారిలో సెల్ఫీ దిగేందుకు సోమవారం నుంచి ముహూర్తం పెట్టుకున్నారు. సోమవారం చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో రాజకీయాలపై అభిమానులను ఉద్దేశించి
సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులను కలుస్తున్నారు. వారిలో సెల్ఫీ దిగేందుకు సోమవారం నుంచి ముహూర్తం పెట్టుకున్నారు. సోమవారం చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో రాజకీయాలపై అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన రజనీకాంత్.. మంగళవారం కూడా ఫ్యాన్స్‌తో సెల్ఫీ తీసుకున్నారు. ఇదే కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు ఎస్పీ ముత్తురామన్ మాట్లాడుతూ.. రజనీకాంత్ నివాస భవనంపై ఓ పూరి గుడిసె ఉంటుందని.. అది ఎందుకు ఉంటుందో ఎవరికైనా తెలుసా? అని ప్రశ్నించారు.
ఇందుకు సమాధానం కూడా ఆయన చెప్తూ.. రజనీకాంత్ నిరాడంబరతకు అది నిదర్శనమని ఎస్పీ ముత్తురామన్ తెలిపారు. తామిద్దరం కలిసిన మొదటిరోజు ఆయన తనతో ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారన్నారు. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ, ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో చదువుతున్న సమయంలో చెన్నైలో కొంతమంది స్నేహితులతో కలిసి రజనీకాంత్ గుడిసెలోనే ఉండేవారని గుర్తు చేశారు.
ఇంత ఎదిగినా ఆయన దానిని మర్చిపోలేదని, అందుకే ఇప్పుడు ఆయన భవంతి పైన అలాంటి గుడిసె ఒకటి కట్టించారని అన్నారు. మనం ఎక్కడ నుంచి వచ్చామనేది మరిచిపోకూడదని రజనీకాంత్ చెప్పేవారని.. అంత విశిష్ట వ్యక్తిత్వం రజనీకాంత్‌దని చెప్పారు.