Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఓ హోమోసెక్సువల్!?

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఓ యువకుడు సంచలన ఆరోపణలు చేశారు. తనను లైంగికంగా కూడా వేధించాడంటూ ఆ యువకుడు చేసిన ప్రధాన ఆరోపణ. దీంతో వర్మ హోమోసెక్సువలా అనే సందేహం తలెత్తింది.

Advertiesment
దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఓ హోమోసెక్సువల్!?
, శనివారం, 27 జనవరి 2018 (08:57 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఓ యువకుడు సంచలన ఆరోపణలు చేశారు. తనను లైంగికంగా కూడా వేధించాడంటూ ఆ యువకుడు చేసిన ప్రధాన ఆరోపణ. దీంతో వర్మ హోమోసెక్సువలా అనే సందేహం తలెత్తింది. హాలీవుడ్‌లో అనేక మంది తారల జీవితాలతో ఆడుకున్న హార్వే వీన్‌స్టీన్‌తో వర్మను పోల్చారు. 
 
ఆ వ్యక్తి పేరు పి.జయకుమార్. ఓ రచయిత. ‘విజయవంతమైన వ్యక్తులతో పనిచేస్తే భవిష్యత్తు ఉంటుందని ఆశించడం సహజం! నేనూ అలాగే అనుకున్నాను. వర్మలో మరో మనిషి ఉన్నాడు. ఆయనలోని స్వలింగసంపర్క స్వభావాన్ని బయటపెట్టాలనుకోలేదు. కానీ వర్మ లైంగిక వేధింపులను వ్యతిరేకించాల్సిన సమయం వచ్చింది’ అంటూ జయకుమార్‌ చేసిన కామెంట్స్‌ సంచలనం సృష్టిస్తున్నాయి.
 
వర్మ "సర్కార్‌-3" సినిమాకు జయకుమార్‌ రచయితగా పనిచేశారు. ఇటీవల హాలీవుడ్‌ నిర్మాత హార్వే వీన్‌స్టీన్‌పై వందమందికిపైగా మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ‘మీ టూ’ ఉద్యమం నేపథ్యంలో వీన్‌స్టీన్‌ అకృత్యాలను బయటపెట్టారు. ‘మీ టూ’ తరహాలో ఆర్జీవీ అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని జయకుమార్ పిలుపునిచ్చారు. అయితే, జయకుమార్‌ ఆరోపణలను వర్మ తోసిపుచ్చారు. అతనో దొంగ అని ఆరోపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#Bhaagamathie రివ్యూ రిపోర్ట్: హారర్‌తో ఆకట్టుకునే పొలిటికల్ థ్రిల్లర్.. కత్తి పాజిటివ్ రిపోర్ట్