Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాహుబలి Vs గౌతమీపుత్ర శాతకర్ణి.. జక్కన్నకు క్రిష్‌కు పోలికలేంటి..? ఖైదీని ఎందుకు పక్కనబెట్టారు?

సంక్రాంతికి బాస్ వచ్చాడు. ఆపై శాతకర్ణి వచ్చాడు. వీరిద్దరి మధ్యే ఫైట్ అని అందరూ అనుకున్నారు. కానీ సీన్ మారిపోయింది. గౌతమీపుత్ర శాతకర్ణి ప్రస్తుతం బాహుబలితో పోటీ పడుతోంది. వాస్తవానికి చిరంజీవి ఖైదీకీ, శ

Advertiesment
Director
, శుక్రవారం, 13 జనవరి 2017 (18:11 IST)
సంక్రాంతికి బాస్ వచ్చాడు. ఆపై శాతకర్ణి వచ్చాడు. వీరిద్దరి మధ్యే ఫైట్ అని అందరూ అనుకున్నారు. కానీ సీన్ మారిపోయింది. గౌతమీపుత్ర శాతకర్ణి ప్రస్తుతం బాహుబలితో పోటీ పడుతోంది. వాస్తవానికి చిరంజీవి ఖైదీకీ, శాతకర్ణికీ పోలిక పెట్టడమే తప్పు. థీమ్‌లోగాని, థియరీలో గానీ, టార్గెటెడ్ ఆడియెన్స్‌లో గానీ దేనికదే విభిన్నం. పెడితే గిడితే వసూళ్ల దగ్గర మాత్రమే ఈ రెండు సినిమాలకూ పోలిక పెట్టుకోవచ్చు. అందుకే.. ఇప్పుడు సినీ గోయర్స్ దృష్టి మొత్తం బాహుబలిపై పడింది. శాతకర్ణికి బాహుబలికి పోలిక చూసుకుంటున్నారు. జక్కన్న బాహుబలినీ, క్రిష్ శాతకర్ణినీ పక్కపక్కన పెట్టుకుని పోల్చి చూసుకోవడం మొదలైంది. 
 
క్రిష్- రాజమౌళి ఇద్దరూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్కూల్ నుంచి వచ్చినవాళ్లే. ప్రేక్షకుడికి విజువల్ ఫీస్ట్ వడ్డించడం ఎలాగో ఆయన దగ్గరే నేర్చుకున్నారు. అయితే ఎవరి శైలి వాళ్ళకుంది. బాహుబలి.. ఒక ఫాంటసీ.. కల్పితకథ. మార్పులు-చేర్పులు దర్శకుడి చేతుల్లోనే ఉంటాయి. వక్రీకరించారన్న అపవాదులు గానీ, చరిత్రను అవమానించారంటూ కోర్టు కేసులు గానీ ఏమీ వుండవు. కానీ క్రిష్ హిస్టరీని తీసుకుని అద్భుతంగా రిలీజ్ చేశాడు.
 
చరిత్ర నుంచి తీసుకున్న కథావస్తువు గనుక.. మేకింగ్‌లో పొల్లు పోకుండా చూసుకోవాలి.. కనీసం ఇక్కడైనా క్రిష్ దొరుకుతాడని క్రిటిక్స్ ఎదురుచూశారు. కానీ.. క్రిష్ వంటకాన్ని, దాన్ని వండిన పద్ధతిని చూసి పెన్నులకు మూతలు బిగించేశారు. యుద్ధ సన్నివేశాలతో బాహుబలిని పోల్చుకుంటే.. అక్కడా వైవిధ్యం చూపాడు. బాలయ్యకు తగ్గట్టు సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెమోకి నాతో బోర్ అనిపించినట్లుంది.. కొంత గ్యాప్ తర్వాత కలిసి నటిస్తా: కీర్తి సురేష్