Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Aari: అరి సినిమా చూసి మోడరన్ భగవద్గీతలా ఉందన్నారు : డైరెక్టర్ జయశంకర్

Advertiesment
Ari Cinema, Director Jayashankar

చిత్రాసేన్

, బుధవారం, 8 అక్టోబరు 2025 (16:00 IST)
Ari Cinema, Director Jayashankar
సినిమాల మీద ప్యాషన్ తో మంచి ఉద్యోగం వదులుకుని ఇండస్ట్రీకి వచ్చాను. 2014లో టాలీవుడ్ లో అడుగుపెట్టి నాలుగేళ్లకు 2018లో పేపర్ బాయ్ మూవీతో దర్శకుడిని అయ్యాను. తక్కువ టైమ్ లోనే దర్శకుడివి అయ్యావు అన్నారు. నా మొదటి సినిమా తర్వాత పెద్ద సంస్థల నుంచి ఆఫర్స్ వచ్చాయి. అయితే కోవిడ్, ఇతర పరిస్థితుల వల్ల ఆ ప్రాజెక్ట్స్ మొటీరియలైజ్ కాలేదు. అప్పుడు బయటకు వచ్చి 2021లో అరి మూవీకి వర్క్ చేయడం ప్రారంభించాను అని డైరెక్టర్ జయశంకర్ అన్నారు.
 
వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పేపర్ బాయ్ ఫేమ్ జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. అరి సినిమా ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో ఈ సినిమా హైలైట్స్ తెలిపారు డైరెక్టర్ జయశంకర్.
 
- నాకు చిన్నప్పటి నుంచి పురాణాలు, ఇతిహాసాలు అంటే ఆసక్తి. వాటి గురించి తెలుసుకుని, అవగాహన పెంచుకున్నాను. మన పురణాల్లో అరిషడ్వర్గాలను జయించాలి అని చెప్పారే తప్ప ఎక్కడా వాటిని ఎలా జయించాలో చెప్పలేదు. 2016లో ఈ స్టోరీ ఐడియా వచ్చింది. హిమాలయాలకు వెళ్లి కొందరు యోగులను కలిసి అరిషడ్వర్గాల గురించి సినిమా చేయాలనే ఆలోచనను తెలిపాను. వారు మంచి ప్రయత్నమని చెప్పి అనేక విషయాలు వెల్లడించారు. అరిషడ్వర్గాలను జయించేందుకు వారి ద్వారా మార్గాలు, సూచనలు తెలుసుకున్నాను. వాటి ఆధారంగానే ఈ ‘అరి’  చిత్రాన్ని రూపొందించాను. ఇలాంటి కథల్ని పూర్తిగా సందేశాత్మకంగా కాకుండా ఎంటర్ టైనింగ్ గా చెప్పాలి. ఆ ప్రయత్నంలో సఫలమయ్యాననే అనుకుంటున్నా. వైవా హర్ష కామెడీ బాగా నవ్విస్తుంది.
 
- నాకు ఉపేంద్ర గారి మూవీస్ బాగా ఇష్టం. ఆయన సినిమాలు కమర్షియల్ గా ఉంటూనే ఒక మెసేజ్ ఉంటుంది. ఉపేంద్ర మూవీ చూసినప్పుడు అలా ఒక సినిమా తెరకెక్కించాలనే ఆలోచన కలిగింది. ‘అరి’ కథ చెప్పినప్పుడు మా మూవీలో నటించిన ఆర్టిస్టులంతా హ్యాపీగా ఫీలయ్యారు. ఇలాంటి సబ్జెక్ట్ తో మూవీ రాలేదని అన్నారు.
 
- మాకున్న బడ్జెట్ లో క్వాలిటీ విజువల్ ఎఫెక్టులు చేశాం. అలాగే ఏఐ టెక్నాలజీని కూడా ఉపయోగించాం. సినిమాలో రెండు సాంగ్స్ ఉంటాయి. ఆ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మనిషి కోరికలన్నీ ఒకదానితో మరొకటి ముడిపడే ఉంటాయి. మనం కోరుకున్నది దక్కినప్పుడు అహం ఏర్పడుతుంది, అదే పక్కవారికి దక్కితే అసూయ కలుగుతుంది.
 
- వెంకయ్య నాయుడు, మల్లాది, యండమూరి లాంటి వాళ్లు మా సినిమాను చూసి అభినందించారు. వెంకయ్య నాయుడు గారు ‘అరి’ సినిమా చూసి మోడరన్ భగవద్గీతలా ఉంది అన్నారు. పురణాలు, ఇతిహాసాలు చదవని యువత ఈ సినిమా చూస్తే వాటిలోని సారం తెలుస్తుంది అన్నారు. ఆయన మాటల్ని గొప్ప ప్రశంసగా తీసుకున్నాం. అశ్వనీదత్ గారు కూడా మా మూవీ చూసి అభినందించారు. మా మూవీని హిందీలో ఒక పెద్ద హీరో, కన్నడలో ఒక స్టార్ చూశారు. వారికి బాగా నచ్చింది. అన్నీ కుదిరితే వారితో ఆయా భాషల్లో ‘అరి’ రీమేక్ చేస్తా.
 
- మన దేశంలో పబ్బులకు వెళ్లేవాళ్లు ఎంతమంది ఉన్నారో, గుడికి వెళ్లేవారు కూడా అంతకంటే ఎక్కువే ఉన్నారు. అలా స్పిరిచువల్ ఆలోచనలు ఉన్నవారు మా సినిమాను చూసినా చాలు అనుకుంటున్నాం.
 
‘అరి’ సినిమా యూత్ ఆడియెన్స్ కు కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ప్రీ క్లైమాక్స్ వరకు మా మూవీ ఏం జరుగుతుంది నెక్ట్స్ అనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. క్లైమాక్స్ 20 నిమిషాలు మాత్రం ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. తమకు కావాల్సినది దక్కించుకునేందుకు కొందరు వ్యక్తులు ఏం చేశారు అనేది ఈ చిత్ర నేపథ్యం. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో ఓ సినిమా చేయబోతున్నా. డిసెంబర్ నుంచి ఆ మూవీ షూటింగ్ కు వెళ్తున్నాం.
 
ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి,  డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన సినిమా ‘అరి’. లింగ గుణపనేని కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి 'మై నేమ్ ఈజ్ నో బడీ' అనేది ఉపశీర్షిక.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మటన్ సూప్ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా: డైరెక్టర్ వశిష్ట