Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దిల్ రాజు నిజంగానే ట్రాక్ తప్పారా? టాలీవుడ్ ప్రముఖుల ఫీలింగ్ ఏంటి?

Dil Raju

ఠాగూర్

, మంగళవారం, 5 నవంబరు 2024 (10:35 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోని ప్రముఖ బడా నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఆయన స్టార్ ప్రొడ్యూసర్. ఆయన నిర్మించే చిత్రాల్లో హీరోగా నటించాలని ప్రతి ఒక్క హీరోతో పాటు హీరోయిన్‌ ఆశపడతారు. కారణం.. వైవిధ్యభరితమైన కథలతో, కొత్త దర్శకతులతో చిత్రాలను నిర్మించి ఎన్నో మరిచిపోలేని ఘన విజయాలను సొంతం చేసుకున్నారు. 
 
కొత్త కథలతో సినిమాలు తీయడంలో నవతరం ప్రేక్షకుల నాడి పట్టుకోవడంలో దిల్ రాజుది పైచేయి. అయితే, ఇదంతా ఒకప్పటి మాట. ఇపుడు దిల్ రాజు కూడా రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల నిర్మాతల బాటలో పయనిస్తున్నారు. కొత్త దర్శకులతో తన అభిరుచికి తగిన విధంగా చిత్రాలను నిర్మించేందుకు ఆయన ఆసక్తి చూపడం లేదు. ఈ విషయాన్ని ఆయన గ్రహించినట్టున్నారు. అందుకే తాను ట్రాక్ తప్పాను అంటూ స్వయంగా వెల్లడించారు. 
 
దుల్కర్ సల్మాన్ - మీనాక్షి చౌదరి కాంబినేషన్‌లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన చిత్రం "లక్కీ భాస్కర్". ఈ చిత్రం సక్సెస్ వేడుకలు తాజాగా జరిగాయి. ఇందులో పాల్గొన్న దిల్ రాజు మాట్లాడుతూ, "ఈ మధ్య నేను ట్రాక్ తప్పాను. నన్ను నేను వంశీలో చూసుకుంటున్నాను" అని ఎంటువంటి మొహమాటం, భేషజాలు లేకుండా తన మనసులోని భావాలను వ్యక్తం చేశారు. 
 
దిల్ రాజు వంటి బడా నిర్మాత వెంట ఈ తరహా మాటలు రావడంతో ప్రతి ఒక్కరూ విస్తుపోయారు. పైగా, ఆ మధ్య 'మహారాజా' చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో దర్శకుడు బుచ్చిబాబు మీరు ఎవరినైనా మిస్ అవుతున్నారా అని హీరో విజయ్ సేతుపతిని అడిగిన ప్రశ్నకు "నన్ను నేనే మిస్ అవుతున్నాను" అని చెప్పిన సమాధానాన్ని ఇపుడు ప్రతి ఒక్కరూ గుర్తుకు తెచ్చుకున్నారు. 
 
'మహారాజా' సినిమా ప్రమోషన్‌లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ, తనను తాను మిస్ అవుతున్నాననే ఫీలింగ్ ఉన్న వాళ్లందరినీ కదిలించింది. సో... ఇపుడు దిల్‌ రాజు కూడా తనను తాను మిస్‌ అవుతున్నాననే ఫీలింగ్‌లో ఉన్నాడేమో అనిపించింది. 
 
కానీ దిల్‌ రాజును మళ్లీ అందరూ విజయాల రాజుగా చూడాలని.. ఆయన నుంచి మరిన్ని మరపురాని సినిమాలు రావాలని ఆశిస్తున్నారు. అయితే ఇదంతా దిల్‌ రాజు తెలియని కొత్త విషయమేమీ కాదు. తప్పకుండా హీ విల్‌ బ్యాక్‌ విత్‌ బ్యాంగ్‌!.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నితిన్ వరుస పరాజయాలకు "రాబిన్‌‌హుడ్" బ్రేక్ వేసేనా?