Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మగాళ్లపై ఆధారపడను.. నన్ను పురుషులతో సమానంగా పెంచారు: ప్రియాంక చోప్రా

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ చిత్రం బేవాచ్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తన ప్రతిభతో హాలీవుడ్‌లోనూ అవకాశాలను సంపాదిస్తూ గ్లోబల్‌స్టార్‌గా ఎదుగుతోంది ప్రియాంక చోప్రా. ఈ సందర్భంగా..

Advertiesment
మగాళ్లపై ఆధారపడను.. నన్ను పురుషులతో సమానంగా పెంచారు: ప్రియాంక చోప్రా
, గురువారం, 22 డిశెంబరు 2016 (11:34 IST)
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ చిత్రం బేవాచ్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తన ప్రతిభతో హాలీవుడ్‌లోనూ అవకాశాలను సంపాదిస్తూ గ్లోబల్‌స్టార్‌గా ఎదుగుతోంది ప్రియాంక చోప్రా.

ఈ సందర్భంగా.. ఇటీవల భారత్‌కి తిరిగొచ్చిన ప్రియాంకని గ్లోబల్‌ స్టార్‌గా గుర్తింపు పొందాక.. చుట్టూ ఉండేవాళ్ల ప్రవర్తనలో ఏమైనా మార్పుని గమనించారా? అని అడిగితే ఆసక్తికరమైన సమాధానమిచ్చింది. అలాంటి విషయంపై ఇంతవరకు శ్రద్ధ పెట్టలేదని, దాని గురించి ఆలోచించడం కూడా ఇష్టం ఉండదని.. అలాగే ఫేమస్ కావాలని ఇండస్ట్రీకి రాలేదని చెప్పింది. 
 
అనుకోకుండా గుర్తింపు వచ్చిందని.. ముఖ్యంగా ఇతరులపై ఆధారపడనని ప్రియాంక చోప్రా క్లారిటీ ఇచ్చింది. మనది పురుషాధిక్య సమాజం. కాబట్టి మహిళలు ఎలాంటి భయం లేకుండా ప్రయత్నించినప్పటికీ చివరకి పురుషుల మీదనే ఆధారపడుతుంటారు. కానీ నేను అలా కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు నన్ను పురుషులతో సమానంగా పెంచారు.

కాబట్టి పురుషుల మీద ఆధారపడకుండా ఏదైనా సాధించగలననే నమ్మకం ఉందని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. అలాగే సాధించిన విషయాలను తలచుకుని విశ్రాంతి తీసుకోనని చెప్పింది. ఎప్పుడూ తర్వాత ఏం చేయాలనే దానిపై ఆలోచన పెడతానని ప్రియాంక చోప్రా వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"కట్టప్పకు సమయం లేదు మిత్రమా"? క్రిష్ ముందు రాజమౌళి దిగతుడుపేనా?