Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Advertiesment
Kapil Sharma show

ఐవీఆర్

, శనివారం, 23 ఆగస్టు 2025 (19:40 IST)
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో యొక్క రాబోయే ఎపిసోడ్ పైన భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు ప్రధాన వేదికపైకి రావడంతో నవ్వుల విలాసానికి హామీ ఇస్తుంది. బోట్ నుంచి అమన్ గుప్తా, మామా ఎర్త్ నుంచి గజల్ అలాగ్, ఓయో నుంచి రితేష్ అగర్వాల్, పేటీఎం నుంచి విజయ్ శేఖర్ శర్మలు కపిల్ శర్మతో కలిసి పరిహాసం, చమత్కారం, స్ఫూర్తిదాయకమైన కథలతో అనందానుభూతులను అందించనున్నారు.
 
వ్యాపారం, చమత్కారంను కలిసిన వేళ, కపిల్ వారి ప్రయాణాలు, విచిత్రాలు, రహస్యాలలోకి ప్రవేశిస్తూనే, తన ట్రేడ్ మార్క్ హాస్యంతో నోరు విప్పని సీఈఓలను సైతం మనస్ఫూర్తిగా ఆనందానుభూతులను పంచుకునేలా చేస్తారు. విజయ్ శేఖర్ శర్మ యొక్క వినయపూర్వకమైన ప్రారంభాన్ని గురించి వెల్లడించిన కపిల్, విలాసవంతమైన ఖర్చు అలవాట్ల గురించి అడిగారు. దీనికి విజయ్ సమాధానం ఇస్తూ, డబ్బు ఖర్చు చేస్తున్నప్పుడు ఎల్లప్పుడూ ఉత్తమ మనుగడ విధానంలో ఉండాలని చెబుతూనే, తన ఒత్తిడిని తగ్గించే విధానం గోల్గప్పే అని ఒప్పుకున్నారు. హామ్... అది మనల్ని ఆలోచింపజేస్తుంది కదూ, అతను తన లక్ష్యాలు మరియు గప్ప లను పూర్తి చేసిన తర్వాత కూడా పేటీఎం కరో అనే నినాదంతోనే వెళ్తుంటారా?
 
మంచి జీవితాన్ని గడపడానికి ఎంత డబ్బు సరిపోతుందని కపిల్ చిలిపిగా అడిగినప్పుడు, విజయ్, నెలకు 1-2 లక్షలు అని సమాధానం ఇచ్చారు. కపిల్, వెంటనే ఉత్నా రఖ్ కే బాకీ హుమే పేటీఎం కర్ దేంగే? (అది ఉంచుకుని మిగిలిన మొత్తం మాకు పేటీఎం చేస్తారా?) అని అడిగేసారు.
 
విజయ్ ఇంజనీరింగ్ కళాశాలలో తన పట్టణ మూలాలు, ఇంగ్లీష్‌తో పడిన ఇబ్బందుల గురించి మాట్లాడినప్పుడు సంభాషణ మరింత సరదాగా మారింది. హిందీ, ఇంగ్లీష్ పుస్తకాలను పక్కపక్కనే ఉంచి చదువుకున్నట్లు ఆయన గుర్తుచేసుకున్నారు, ఏక్ మే లిఖా థా ప్రతిరోధ్, ఔర్ దూస్రే మే రెసిస్టెన్స్, కపిల్ తన దైన శైలిలో, అకస్మాత్తుగా, ముఝే రియలైజషన్ హువా హై... ముఝే తో ఇత్నీ హిందీ భీ నహీ ఆతీ! అని నవ్వులు పంచారు.
 
ఆప్ ఇస్ బాత్ కా ఏక్ ఎగ్జాంపుల్ హో కే భాషా కభీ సక్సెస్ కా మధ్యం నహీ హోతీ అంటూ కపిల్‌ను విజయ్ ప్రశంసించారు. భారతదేశం నిజంగా గ్లోబల్‌గా దూసుకుపోతోందని, చాలామంది భారతీయ సీఈఓలు ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారని గజల్ అలఘ్ తెలిపారు. హాస్య చతురత, ప్రేరణ, మొత్తం గొల్ గొప్ప చర్చ, ఈ ఎపిసోడ్ సక్సెస్, స్టాండ్-అప్ యొక్క బ్లాక్‌బస్టర్ సమ్మేళనంగా ఉంటుందని హామీ ఇస్తోంది, ఆగస్ట్ 23న, నెట్‌ఫ్లిక్స్ యొక్క ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో మాత్రమే ఇది ప్రసారమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్