కొలవెరి ఫేమ్ ధనుష్ నటించిన "తిరుచిట్రంబలం" మూవీ తిరు పేరుతో తెలుగులో రిలీజైంది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ మంచి కలెక్షన్లను సాధించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
ఈ సినిమాతో ధనుష్‌కు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. అంతేకాకుండా ధనుష్‌కు వంద కోట్ల కలెక్షన్లను సాధించిన మొదటి సినిమాగా ఈ చిత్రం నిలిచింది.
ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రం గత రాత్రి నుండి ‘సన్ ఎన్‌ఎక్స్‌టీ’లో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించాడు. ధనుష్‌కు జోడీగా రాశీఖన్నా, నిత్యామీనన్, ప్రియా భవాని శంకర్‌లు హీరోయిన్‌లుగా నటించారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా కీలకపాత్రలో నటించాడు. మ్యూజిక్ సెన్సేషన్ అనురుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
ప్రస్తుతం ధనుష్ నటించిన 'నానే వరువెన్' విడుదలకు సిద్ధంగా ఉంది. సెల్వా రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని తెలుగులో ‘నేనే వస్తున్నా’ పేరుతో గీతా ఆర్స్ట్ బ్యానర్‌పై అల్లు అరవింద్ విడుదల చేస్తున్నాడు. దీనితో పాటుగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న 'సార్' డిసెంబర్ 2న విడుదల కానుంది. ‘రంగ్‌దే’ ఫేం వెంకీ అట్లూరీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.