బహుభాషా చిత్రాల హీరోయిన్ నిక్కీ గల్రాణి ఇంట్లో చోరీ జరిగింది. ఆ చోరీ చేసింది ఎవరో కాదు, గల్రాణి ఇంట్లో పని చేసే ధనుష్ అనే 19 ఏళ్ల యువకుడని నటి అనుమానం వ్యక్తం చేసింది.
ఆమె ఇంట్లో సుమారు రూ. 1.25 లక్షల విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి. పోలీసులకి ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్ట్ చేసారు.
నిక్కీ గల్రానీ చెన్నైలోని రాయపేటలో నివాసం వుంటోంది. ఇటీవల ఆమెకి వరుస కోలీవుడ్ ఆఫర్లు రావడంతో బిజీగా వుంది.