Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డెలివరీ బాయ్ చేతుల మీదుగా విడుదల చేసిన దేవ్ పారు చిత్రం పోస్టర్

Advertiesment
Dev paru poster

డీవీ

, శుక్రవారం, 16 ఆగస్టు 2024 (13:23 IST)
Dev paru poster
ఏకే ప్రోడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న దేవ్ పారు చిత్రం తాజాగా పోస్టర్ లాంచ్ జరిగింది. ఈ పోస్టర్ లాంచ్ వేడుక చాలా వినుత్నంగా జరిగింది. ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీలో పనిచేసే డెలివరీ బాయ్ చేతుల మీదుగా ఈ లాంచ్ జరగడం విశేషం. తన విలువైన సమయాన్ని పోస్టర్ అవిష్కరణకు వినియోగించినందుకు దేవ్ పారు చిత్ర యూనిట్ డెలివరీ బాయ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ ఒక వీడియోను విడుదల చేశారు.
 
అందరి ఆకలి తీర్చడానికి డెలివరీ బాయ్స్ ఎంతో కష్టపడుతూ.. ఎండ, వాన అని తేడా లేకుండా సమయానికి ఫుడ్ అందిస్తున్నారని వారి శ్రమకు దేవ్ పారు టీమ్ ఒక చిన్న ట్రిబ్యూట్‌ను ప్లాన్ చేశారు. అందుకని ఒక డెలివరీ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేసీ, ఆహారం తీసుకొచ్చిన డెలివరీ బాయ్‌తో పోస్టర్ లాంచ్ చేశారు. వీరి ఐడియాకు నెటిజనులు ఫిదా అయిపోతున్నారు. పోస్టర్ లాంచ్‌ను వినుత్నంగా ఆవిష్కరించడమే కాకుండా ఇలాంటి సామాజిక బాధ్యతను అందరికి గుర్తుచేశారంటూ సోషల్ మీడియాలో నెటిజనులు ముచ్చటించుకుంటున్నారు. 
 
సామాన్యుడిని సెలబ్రేటీ చేసిన దేవ్ పారు టీమ్ పోస్టర్ లాంచ్‌లోనే ఇలాంటి ఐడియాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారంటే ఇంకా ప్రమోషన్లు ఏ రేంజ్‌లో ఉంటాయో, సినిమా కంటెంట్ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులను ఆసక్తి నెలకొంది. కచ్చితంగా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు, త్వరలోనే మరో సాలిడ్ అప్డేట్‌తో వస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిస్టర్ బచ్చన్ అట్టర్ ప్లాప్ కు కారణం ఇదేనా?