Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లక్ష రూపాయలు గెలుచుకోండంటూ డియర్ కృష్ణ వినూత్న కాంటెస్ట్

Advertiesment
Dear Krishna   contest poster

డీవీ

, బుధవారం, 20 నవంబరు 2024 (15:40 IST)
Dear Krishna contest poster
ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. అనుభూతితో పాటు, అదృష్టాన్ని తీసుకొచ్చే సినిమాలు చాలా చాలా అరుదుగా వస్తాయి. అలాంటి అత్యంత అరుదైన చిత్రమే 'డియర్ కృష్ణ'. ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచడమే కాదు, లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశాన్ని కూడా అందిస్తోంది ఈ చిత్రం.
 
పి.ఎన్.బి సినిమాస్ బ్యానర్ పై రూపొందుతోన్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'డియర్ కృష్ణ'. ఈ సినిమా ద్వారా పీఎన్ బలరామ్ రచయితగా, నిర్మాతగా పరిచయమవుతున్నారు. దినేష్ బాబు డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ హీరోగా పరిచయం అవుతున్న 'డియర్ కృష్ణ' చిత్రంలో యువ సంచలనం, 'ప్రేమలు' చిత్రం ఫేమ్ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తున్నారు. ఐశ్వర్య కూడా మరో హీరోయిన్ గా నటిస్తున్నారు.
 
శ్రీ కృష్ణుడికి, కృష్ణ భక్తుడికి మధ్య జరిగిన ఒక మిరాకిల్ ని ప్రేరణగా తీసుకొని, వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 'డియర్ కృష్ణ' కథాకథనాలు కొత్తగా, ఎవరూ ఊహించని విధంగా ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది. కథాకథనాలలో మాత్రమే కాకుండా, ప్రచార కార్యక్రమాల్లోనూ కొత్తదనాన్ని చూపిస్తోంది టీమ్. ఈ క్రమంలో "లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశం" అంటూ వినూత్న కాంటెస్ట్ ను ప్రకటించింది.
 
"మీరు దేవుణ్ణి బాగా నమ్ముతారా. అయితే మీరు లక్ష రూపాయలు గెలుచుకున్నట్లే. డియర్ కృష్ణ మూవీ టీం ఒక కాంటెస్ట్ పెడుతుంది. శ్రీ కృష్ణుడికి, కృష్ణ భక్తుడికి మధ్య జరిగిన ఒక మిరాకిల్ ని బేస్ చేసుకొని ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాంటి మిరాకిల్ మీ ఫ్యామిలీలో ఏదైనా జరిగితే ఆ ఎక్స్ పీరియన్స్ ని మాతో షేర్ చేసుకోండి. మాకు వచ్చిన ఎంట్రీస్ లో మూడు ఫ్యామిలీస్ ని సెలెక్ట్ చేసి, వారిలో బెస్ట్ ఫ్యామిలీకి రూ.1 లక్ష రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం. ఆ భగవంతుడితో మీకు ఉన్న ఎక్స్ పీరియన్స్ ని వాట్సాప్ (9847622342) లో షేర్ చేయండి లేదా మెయిల్ ([email protected]) చేయండి." అంటూ  'డియర్ కృష్ణ' నిర్మాత సంచలన ప్రకటన చేశారు.
 
హరి ప్రసాద్ సంగీతం అందిస్తున్న డియర్ కృష్ణ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా దినేష్ బాబు, ఎడిటర్ గా రాజీవ్ రామచంద్రన్ వ్యవహరిస్తున్నారు. లెజెండరీ సింగర్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పాడిన చివరి పాట ఈ సినిమా లోనిదే కావడం విశేషం. 'చిరుప్రాయం' అంటూ సాగే ఈ పాట ఇప్పటికే విడుదలై విశేషంగా ఆకట్టుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడు భాషల్లో ఫుట్ బాల్ ప్రేమికుల కథ డ్యూడ్