Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దాసరి చేతులమీదుగా 'చిల్డ్రన్ సురక్ష సొసైటీ' ప్రారంభం

Advertiesment
Dasari Narayana Rao
, శనివారం, 11 జూన్ 2016 (20:55 IST)
అనాథ చిన్నారుల కోసం, వృద్ధుల కోసం, గుండె సంబంధిత వ్యాధి గ్రస్తులను ఆదుకునేందుకు కరీంనగర్ జిల్లాలో 2006లో మధుసూదన్ అనే వ్యక్తి ఓ సంస్థను ప్రారంభించారు. దాన్ని అభివృద్ధి పరచాలనే ఉద్దేశ్యంతో చౌదరి ఎం.ఆర్. వడ్లపట్ల హైదరాబాద్‌లో చిల్డ్రన్ సురక్ష సొసైటీ అనే పేరుతో స్వచ్చంధ సంస్థను స్థాపించారు. దీన్ని దర్శకరత్న దాసరి నారాయణరావు చేతుల మీదుగా ప్రారంభమైంది. 
 
ఈ సందర్భంగా దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. 'పిల్లల క్షేమం కోరిన మధుసూదన్‌ని స్ఫూర్తిగా తీసుకొని చౌదరి హైదరాబాద్‌లో చిల్డ్రన్ సురక్ష సొసైటీ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థను ఎమ్మెల్సీ రంగారెడ్డి అధ్వర్యంలో ప్రారంభించడం మంచి విషయం. తస్లీమియా వ్యాధి గ్రస్తులను ఆదుకోవడం కోసం ఈ సంస్థ ఎన్నో సేవలను అందిస్తోంది. కరీంనగర్‌లో 200 మందిని దత్తత తీసుకొని సేవలు అందిస్తోన్న ఈ సంస్థ అక్కడికే పరిమితం కాకూడదని తెలంగాణా రాష్ట్రంలో కూడా అభివృద్ధి చేయాలని ఇక్కడ కూడా సంస్థను ప్రారంభించారు. 
 
ప్రభుత్వ సహకారం లేకుండా సొంత డబ్బుతో ఈ సంస్థను నడిపించడం గొప్ప విషయం. దీనికి ప్రభుత్వం సహకారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు వెళితే ఆయన సహకారం అందించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు. చౌదరి ఎం.ఆర్. వడ్లపట్ల మాట్లాడుతూ.. మధుసూదన్ కరీంనగర్‌లో 2006లో స్వచ్చంధ సంస్థను ప్రారంభించారు. ఎందరో అనాథ పిల్లలను, వృద్ధులను, తస్లీమియా వ్యాధి గ్రస్తులను ఆదుకుంటున్నారు. మూడేళ్ళ క్రితం ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. ఆయన స్ఫూర్తితోనే హైదరాబాద్‌లో చిల్డ్రన్ సురక్ష సొసైటీని ప్రారంభించాం. లాభాపేక్ష లేకుండా సొంత డబ్బుతో సంస్థను రన్ చేస్తున్నట్టు తెలిపారు. దీనికి ప్రభుత్వ సహకారం లభించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
 
ఎమ్మెల్సీ రంగారెడ్డి మాట్లాడుతూ.. ఇంట్లో ఉన్న వాళ్ళనే పట్టించుకోకుండా స్వార్థంతో బ్రతుకుతున్న ఈ రోజుల్లో సొంత డబ్బుతో వ్యాధిగ్రస్తులను, చిన్నారులను ఆదుకోవడం మంచి విషయం. దీనికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను అని చెప్పారు. కె.రాఘవ మాట్లాడుతూ.. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన వారందరికీ నా అభినందనలు అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రసాద్, పి.వి.గౌడ్, పబ్బా లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'హ్యాపీ బర్త్‌డే'లో ఆ రాత్రి ఆ నాలుగు గంటల్లో ఏం జరిగింది?