Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్త్రీ పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చిన మరో బాలచందర్ మన దాసరి

వెండితెరను నమ్ముకొని వచ్చిన దారి దొరకని తమ్ముళ్లకు దోవ తెలియని చెల్లెళ్లకు గూడు అయ్యింది దాసరి నారాయణ రావే. హీరో ఓరియంటెడ్ చిత్రాలే తీసినప్పటికీ తన చిత్రాల్లో స్త్రీ పాత్రలకు అత్యంత గౌరవాన్ని ఇచ్చి ప్రతిష్టించిన దర్శకుడు దాసరి. ఒక్కమాటలో చెప్పాలంటే త

Advertiesment
స్త్రీ పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చిన మరో బాలచందర్ మన దాసరి
హైదరాబాద్ , బుధవారం, 31 మే 2017 (06:05 IST)
వెండితెరను నమ్ముకొని వచ్చిన దారి దొరకని తమ్ముళ్లకు దోవ తెలియని చెల్లెళ్లకు గూడు అయ్యింది దాసరి నారాయణ రావే. హీరో ఓరియంటెడ్ చిత్రాలే తీసినప్పటికీ తన చిత్రాల్లో స్త్రీ పాత్రలకు అత్యంత గౌరవాన్ని ఇచ్చి ప్రతిష్టించిన దర్శకుడు దాసరి. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు చిత్రసీమలో మహిళల పట్ల పక్షపాత దృష్టిని ప్రదర్శించిన అరుదైన దర్శకులలో దాసరి అగ్రగణ్యులు. తాతామనవడు సినిమా తర్వాత ఆయన తీసిన ‘సంసారం సాగరం’, ‘బంట్రోతు భార్య’, ‘స్వర్గం–నరకం’ తూర్పు పడమర వంటి తొలిసినిమాలు స్త్రీపాత్రలకు ఒక ఔన్నత్యాన్ని సంపాదించిపెట్టాయి. 
 
ఏయన్నార్‌తో  ‘ప్రేమాభిషేకం’, ‘మేఘసందేశం’, ఎన్టీఆర్‌తో ‘సర్దార్‌ పాపారాయుడు’, ‘బొబ్బిలి పులి’ వంటి సూపర్‌ హిట్‌ సినిమాలు తీశారు. కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు... ఇలా నాటి తరం హీరోలతో పలు విజయవంతమైన చిత్రాలు తీశారు. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్‌లతో కూడా సినిమాలు తెరకెక్కించారు.

కానీ దాసరి దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు చూస్తే ఆయన మహిళా పక్షపాతి అనిపిస్తుంది. ఉదాహరణకు, ‘శివరంజని’, ‘కంటే కూతుర్నే కను’, ‘ఒసేయ్‌ రాములమ్మ’, ‘అమ్మ రాజీనామా’ వంటివి. 
 
సీతారాములు సినిమాలో పారిశ్రామిక వేత్తగా,  గృహిణిగా జయప్రదను దాసరి తీర్చి దిద్దిన వైనం అనితర సాధ్యం. అలాగే తాండ్రపాపారాయుడు సినిమాలో పాపారాయుడిని ప్రేమించి అతడి శఫథం నెరవేర్చడం కోసం భగ్న ప్రేమికురాలిగా మిగిలిపోయి జీవితాన్నే త్యాగం చేసిన వీరవనితగా జయప్రద పాత్రకు కల్పించిన ప్రాధాన్యత అద్భుతం అనే చెప్పాలి.

గోరంటాకు వంటి సినిమాల ద్వారా మలయాళ నటి సుజాతను ఒక్కసారిగా పైకి లేపారు దాసరి. ఇక ప్రేమాభిషేకం సినిమాలో జయసుధ పాత్రకు ప్రాణ ప్రతిష్ట కల్పించారు. జయసుధ, జయప్రద, సుజాత, ప్రభ వంటి ఎంతోమంది తారలను పరిచయం చేసిన ఘనత ఆయనది. తూర్పుపడమర వంటి తొలి సినిమాల్లో స్త్రీ పాత్రలను అత్యంత వైవిధ్య పూరితంగా మలిచారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మానాన్నలకు అన్నం పెట్టని అరాచకానికి పాతరేసిన దాసరి: 'తాతా మనవడు'తో విశ్వరూపం