Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మళ్లీ జతకడుతున్న అమీర్ ఖాన్, దంగల్ హీరోయిన్

దంగల్. ఈ పేరు వింటే వెంటనే గుర్తుకొచ్చే పాత్రలు రెండు. అమీర్ ఖాన్, పాతిమా సనా. ఈ చిత్రంతో అమీర్తో పాటు అంతర్జాతీయ ఖ్యాతి పొందిన వర్ధమాన హీరోయిన్‌గా సనా వెలిగిపోతోంది. ముఖ్యంగా చైనాలో అయితే గీతా పొగట్ పాత్రలో మల్లయుద్ద యోధురాలిగా నటించిన ఫాతిమా సనా నట

Advertiesment
Dangal heroin
హైదరాబాద్ , గురువారం, 8 జూన్ 2017 (03:34 IST)
దంగల్. ఈ పేరు వింటే వెంటనే గుర్తుకొచ్చే పాత్రలు రెండు. అమీర్ ఖాన్, పాతిమా సనా. ఈ చిత్రంతో అమీర్తో పాటు అంతర్జాతీయ ఖ్యాతి పొందిన వర్ధమాన హీరోయిన్‌గా సనా వెలిగిపోతోంది. ముఖ్యంగా చైనాలో అయితే గీతా పొగట్ పాత్రలో మల్లయుద్ద యోధురాలిగా నటించిన ఫాతిమా సనా నటన చూసి  ప్రేక్షకులు తాదాత్మ్యం చెందుతున్నారని వార్తలు. గ్రామీణ సమాజపు వెనుకబాటు తనం నుంచి కష్టపడి ఎదిగివచ్చి అంతర్జాతీయ కుస్తీ పోటీల్లో పాల్గొని పతకం సాధించిన గీతా పొగోట్ జీవితాన్ని చైనా యువతీయువకులు తమ జీవితాలతో పోల్చుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే దంగల్ చైనాలో కనీవినీ ఎరుగని విజయం సాధించింది. 
 
ఆమిర్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో రూపొందిన ‘దంగల్‌’ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో రికార్డులు తిరగరాసిన ఈచిత్రంలో ఆమిర్‌ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అయితే ఇందులోని గీతా ఫొగట్‌ పాత్రలో ఫాతిమా సనా తన అభినయంతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. 
 
ఈ సినిమా ఆద్యంతం సంప్రదాయబద్ధంగా కన్పించిన ఆమె తర్వాత కాస్త హాట్‌హాట్‌ ఫోటోల్లో దర్శనమిచ్చింది. తాజాగా ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా విడుదల చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. మాల్టాలోని సముద్రతీరం వద్ద ఓ కుర్చీలో హాట్‌ ఫోజిస్తూ కూర్చున్న ఫోటోను ఆమె పోస్ట్‌ చేసింది. రెండు గంటల్లోనే దీనికి 26,915 లైకులు వచ్చాయి.
 
ఆమిర్‌ ఖాన్‌ తదుపరి చిత్రం ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’లోనూ పాతిమా నటించబోతోంది. విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, కత్రినాకైఫ్‌ ప్రధాన పాత్రల్లో కన్పించనున్నారు. వాస్తవానికి తొలుత ఈ చిత్రంలోని పాత్రకు దీపికా పదుకొణె, శ్రద్ధాకపూర్‌, అలియా భట్‌, వాణీ కపూర్‌ వంటి స్టార్స్‌ను పరిశీలించినా చివరకు ఆమెను ఈ అవకాశం వరించింది. దీంతో ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు అందుకుంటానని ఆమె భరోసాగా ఉంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంకా పేరు ప్రకటించని సినిమాలో హీరోయిన్‌కు కనీవినీ ఎరుగని పారితోషికం