Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

30 రోజుల్లో రూ.375 కోట్లు... ఇదీ అమీర్ ఖాన్ 'దంగల్' స్టామినా

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'దంగల్'. ఈ చిత్రం విడుదలై నెల రోజులు దాటిపోతోంది. అయినప్పటికీ... కలెక్షన్లు సునామీ సృష్టిస్తోంది. బాక్సాఫీస్‌లోని పాత రికార్డులన్నీ తిరగరాస్తోంది. గత శుక

Advertiesment
Dangal grosses approx Rs.713 crores at the worldwide box office
, సోమవారం, 23 జనవరి 2017 (13:37 IST)
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'దంగల్'. ఈ చిత్రం విడుదలై నెల రోజులు దాటిపోతోంది. అయినప్పటికీ... కలెక్షన్లు సునామీ సృష్టిస్తోంది. బాక్సాఫీస్‌లోని పాత రికార్డులన్నీ తిరగరాస్తోంది. గత శుక్రవారంతో విజయవంతంగా 30 రోజులు పూర్తి చేసుకుని రికార్డు స్థాయిలో రూ.375 కోట్లు కొల్లగొట్టింది.
 
వారాంతం కావడంతో శని, ఆదివారాల్లోనూ అదే హవా కొనసాగించి మరో రూ.3 కోట్లకు పైగా వసూలు చేసి మొత్తం రూ.378.24 కోట్లతో స్టామినా చాటుకుంది. కేవలం దేశీయ మార్కెట్‌లోనే ఈ రికార్డ్ స్థాయి కలెక్షన్ 'దంగల్' సాధించడం సినీ పండితులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.713 కోట్ల మేరకు గ్రాస్ షేర్‌ను వసూలు చేసినట్టు సమాచారం. 
 
ఇంతవరకూ నమోదైన కలెక్షన్ల ప్రకారం, మొదటివారంలో రూ.192.38 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం, రెండో వారాంతానికి మరో రూ111.51 కోట్లు, మూడో వారాంతానికి రూ.44.03 కోట్లు సాధించింది. 30వ రోజు నాటికి రూ.375 కోట్లతో పాతరికార్డులను తిరగరాసింది. 'ఓకే జాను'. 'త్రిబుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్' వంటి కొత్త చిత్రాల పోటీని కూడా 'దంగల్' తట్టుకుని ఐదోవారంలోనూ హవా కొనసాగిస్తుండటం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కళ్ళకలక ఎందుకు వచ్చింది?