Pawan Kalyan, Jani Master
ప్రముఖ కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ పై ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు డ్యాన్సర్ సతీష్. జాని మాస్టర్ అరాచకాలపై ఏపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు కొరియర్ ద్వారా ఫిర్యాదు చేశారు డ్యాన్సర్ సతీష్. జానీ మాస్టర్ ఇటీవలే తమ అసోసియేషన్ మీటింగ్ లొో అధ్యక్ష హోదాలో పాల్గొన్నారు. అక్కడే కొన్ని విషయాల్లో విభేధాలు వచ్చాయని తెలుస్తోంది.
కాగా, రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో సతీష్.. జానీ పై ఫిర్యాదు చేశాడు. తనను జానీ మాస్టర్ వేధిస్తున్నాడని ఫిర్యాదులో వుంది. అలాగే షూటింగ్ లకు తనను పిలవడం లేదని లేఖ లో పేర్కొన్నాడు. అంతేకాక షూటింగ్ లకు తనను పిలవొద్దని ఇతర డాన్స్ డైరెక్టర్లకు ఫోన్ చేసి మరీ చెప్పడం బాధాకరంగా వుందని సతీష్ తెలిపాడు. జానీ మాస్టర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో జనసేన పార్టీలో చేరారు. జనసేన పాటలకు కొరియోగ్రాఫర్ గా కూడా వ్యవహరించాడు.