Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డామిట్ డేవిడ్ రాజుకి పెళ్ళైపోయింది చిత్రం ప్రారంభం

Advertiesment
Damit David rajuki pellai poyindi
, బుధవారం, 15 డిశెంబరు 2021 (16:58 IST)
Pratani Ramakrishna Gowd, Gauri Ronanki, Shiva Kanthamaneni and others
`మ‌ణిశంక‌ర్` ఫేమ్ జి. వెంక‌ట్‌ కృష్ణ‌న్ (జీవికే) ద‌ర్శ‌క‌త్వంలో  డామిట్ డేవిడ్ రాజుకి పెళ్ళైపోయింది .అనే చిత్రం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ ఫిలిం చాంబ‌ర్ అద్య‌క్షుడు ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్, ఉపాద్య‌క్షుడు  నెహ్రు, హీరో  శివ కంఠ‌మ‌నేని, పెళ్లి సంద‌D ద‌ర్శ‌కురాలు గౌరి రోణంకి, ద‌ర్శ‌కుడు మ‌ల్లికార్జున్, నిర్మాత ఆచార్య శ్రీ‌నివాస్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.
 
ద‌ర్శ‌కుడు జీవీకే మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని కిర‌ణ్ కుమార్ గుడిప‌ల్లి,  కె. రామ‌చంద్రారెడ్డి (కేఆర్‌సి) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ద‌ర్శ‌కుడిగా ఇది నా మూడ‌వ సినిమా. ఒక మంచి కాన్సెప్ట్ మ‌రియు మంచి టీమ్‌తో మీ ముందుకు రాబోతున్నాం. ఎమ్ ఎల్ రాజా సంగీత ద‌ర్శ‌కత్వంలో సాంగ్స్ రికార్డింగ్ స్టార్ట్ చేశాం. త్వ‌ర‌లోనే ఆర్టిస్టుల వివ‌రాలు తెలియ‌జేస్తాం అన్నారు. 
 
నిర్మాత కె. రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ప్ర‌ముఖ హీరోయిన్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయ‌బోతుంది. ప్ర‌స్తుతం ఆర్టిస్టుల ఎంపిక జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే  రెగ్యుల‌ర్ షూటింగ్‌ స్టార్ట్ చేస్తాం అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరోగా మారనున్న షణ్ముక్ జశ్వంత్.. బిగ్ హౌస్ నుంచి రాకముందే?