సినిమాను బట్టి రివ్యూ ఉంటుంది... కక్షతో రివ్యూలు రాస్తామా? : మహేశ్ కత్తి
సినిమాను బట్టి రివ్యూ ఉంటుంది కానీ, సినిమాలపై కక్షతో రివ్యూలు రాస్తామా? అని నిలదీశారు. అభద్రతా భావంతోనే తమపై కొందరు సినిమావారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సినీ విశ్లేషకుడు మహేశ్ కత్తి అ
సినిమాను బట్టి రివ్యూ ఉంటుంది కానీ, సినిమాలపై కక్షతో రివ్యూలు రాస్తామా? అని నిలదీశారు. అభద్రతా భావంతోనే తమపై కొందరు సినిమావారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సినీ విశ్లేషకుడు మహేశ్ కత్తి అన్నాడు.
రివ్యూలపై వస్తోన్న వివాదంపై మహేశ్ కత్తి స్పందించారు. ముఖ్యంగా, జూనియర్ ఎన్టీఆర్ నటించిన "జై లవ కుశ" చిత్రంపై తాను రాసిన సమీక్ష వివాదాస్పదమైన విషయం తెల్సిందే. దీనిపై ఆయన స్పందిస్తూ, తాము కూడా ప్రేక్షకులలాంటి వారిమేనని, కాకపోతే సినిమాలను విశ్లేషించగలమని అన్నారు. సినిమాను ప్రేమించాం కాబట్టే తాము విశ్లేషకులమయ్యామని అన్నారు.
విశ్లేషకులను వచ్చి సినిమా తీయమనండని కొందరు అంటున్నారని, తమ పని సినిమాను విశ్లేషించడమేనని అన్నారు. సినిమా బాగుంటే బాగుందని, లోపాలు ఉంటే ఉన్నాయని రాస్తామని అన్నారు. అంతేగాని, సినిమా గురించి అన్నీ తెలుసని తామేం విర్రవీగడం లేదని అన్నారు.
ఉదాహరణకు గత యేడాది 'బిచ్చగాడు' అనే సినిమా వచ్చిందని, ఆ సినిమాపై ఒక్కరు కూడా రివ్యూలు రాయలేదని, ఆ సినిమా సూపర్ హిట్ అయిందని సినీ విశ్లేషకుడు మహేశ్ కత్తి అన్నారు. అలాగే 'పెళ్లి చూపులు' అనే సినిమా వచ్చిందని దానిపై అందరు రివ్యూలు బాగానే రాశారని, 'అర్జున్ రెడ్డి' సినిమాపై కూడా రివ్యూలు బాగానే రాశారని, ఆ సినిమాలపై ఎవరైనా కక్ష గట్టి రివ్యూలు రాశారా? అంటూ ప్రశ్నించారు.