Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

అక్కినేని నాగార్జున ఆవిష్క‌రించిన‌ క్రైమ్‌ థ్రిల్లర్ గాలివాన ట్రైలర్‌

Advertiesment
Akkineni Nagarjuna
, గురువారం, 31 మార్చి 2022 (20:27 IST)
gali vaana poster
పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ నుండి కామెడీ డ్రామా ‘‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’’ . అన్నపూర్ణ స్టూడియోస్‌ నుండి ‘‘లూజర్‌’’ లూజర్‌ 2 వంటి టాప్‌ నాచ్‌ సిరీస్‌ తర్వాత బిబిసి స్టూడియోస్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌ట్కెన్‌మెంట్‌ భాగ స్వామ్యంతో బిబిసి స్టూడియోస్‌ నిర్మించిన యురోపియన్‌ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి ZEE5 వారు ‘గాలివాన’ అనే ఒరిజినల్‌ సిరీస్‌గా నిర్మిస్తున్నారు.
 
ZEE5 ఓటిటిలో ఏప్రిల్‌ 14న  స్ట్రీమింగ్‌ కానున్న ‘గాలివాన’ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ కింగ్‌ అక్కినేని నాగార్జున చేతులు మీదుగా గురువారం సాయంత్రం 5 గం॥లకు అధికారికంగా విడుదలైంది. 1:39 నిముషాల నిడివి కలిగిన ఆ ట్రైలర్‌ వీక్షకులను నరాలు తెగే ఉత్కంఠకు గురి చేస్తోంది. ట్రైలర్‌లోని కంటెంట్‌ను గమనిస్తే.. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సస్పెన్స్‌ క్రైం థ్రిల్లర్‌గా అనిపిస్తోంది. రాధిక సెంటిమెంట్‌ డెలాగ్స్‌తో పాటు ‘‘ఆ లం.. కొడుకు నా కంటికి కనపడితే వాడ్ని నా నుంచి ఆ దేవుడు కూడా  కాపాడలేడు’’ అంటూ హై ఎమోషన్‌తో చెప్పిన డైలాగ్‌  సిరీస్‌లో ప్రతీకారం అనే పాయింట్‌ కూడా ఎంత బలంగా ఉందో చెప్పకనే చెప్పింది. క్వాలిటీ పరంగా, విజువల్స్‌ పరంగా భారీతనం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. గతంలో కొన్ని క్రైమ్‌ థ్రిల్లర్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, ఇందులో మాత్రం మదర్‌ సెంటిమెంట్‌తో కూడిన క్రైం థ్రిల్లింగ్‌ అంశాలు ప్రేక్షకులను ఎమోషనల్‌గా క్యారీ చేసేలా ఉండటం విశేషంగా చెప్పుకోవాలి. సాయికుమార్‌ పాత్ర కూడా ఎమోషన్‌తో పాటు ఫ్యామిలీ బాండిరగ్‌కు ఉన్న విలువను చూపిస్తోంది.ఈ వెబ్‌ సిరీస్‌ను  వీక్షకులకోసం ఏప్రిల్‌ 14న ZEE5 ఓటిటిలో స్ట్రీమింగ్‌ చేయడానికి ప్లాన్‌  చేస్తున్నారు.
 
ఇందులో రాధికా శరత్‌ కుమార్‌, డైలాగ్‌ కింగ్‌ సాయి కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, శరణ్య ప్రదీప్‌, అశ్రిత, అర్మాన్‌ మరియు నందిని రాయ్‌, తాగుబోతు రమేష్‌, కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లు అర్జున్ పుష్పతో బాలీవుడ్‌లో ఇరగదీశాడుగా.. ఇక తగ్గేదేలే..!