Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ డబ్బులు మాత్రమే తీసుకుంటాను : తమన్ (Video)

Advertiesment
S.S. Thaman

ఠాగూర్

, బుధవారం, 22 జనవరి 2025 (13:07 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోని ప్రముఖ సంగీత దర్శకుల్లో తమన్ ఒకరు. ఈయన ఒక సంగీత దర్శకుడుగానే కాకుండా మంచి మానవతావాదిగా కూడా ఇండస్ట్రీలో పేరుంది. తన సంపాదనలో భారీ మొత్తాన్ని దానధర్మాలకు విరాళాలుగా ఇస్తుంటారు. ఈ క్రమంలో తన దాతృత్వంపై ఆయన స్పందించారు. 
 
తాను సినిమాల ద్వారా వచ్చే డబ్బు మాత్రమే తీసుకుంటానని చెప్పారు. క్రికెట్, ఇతర షోల ద్వారా తాను సంపాదించే డబ్బు అంతా ట్రస్ట్, ఓల్డేజ్ హోమ్‌లకే ఇస్తానని తెలిపారు. మన వంతుగా సమాజానికి మనం ఏదైనా చేయాలని అందుకే గత 15 ఏళ్లుగా నేను ఇతర రంగాలలో సంపాదిస్తున్న డబ్బును సమాజానికి ఇస్తూ వస్తున్నట్టు చెప్పారు. 
 
'నేను క్రికెట్, ఇండియన్ ఐడల్, ఇతర షోలలో సంపాదించే డబ్బును ట్రస్ట్ ఛారిటీలకు ఇచ్చేస్తాను. సినిమాల ద్వారా వచ్చే డబ్బును మాత్రమే నా దగ్గర ఉంచుకుంటాను. ఇప్పుడీ ఎన్టీఆర్ యూఫోరియా ట్రస్ట్ కన్సర్ట్ ద్వారా వచ్చే డబ్బులను కూడా ఛారిటీలకే వినియోగిస్తాను' అని తమన్ చెప్పుకొచ్చారు. 
 
ఇక ఫిబ్రవరి 15న జరిగే ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ గురించి మాట్లాడుతూ.. ‘మహనీయులు ఎన్టీఆర్, చంద్రబాబు స్థాపించిన ట్రస్ట్ ఎంతగొప్పదో మనం చుస్తున్నాం.ఎన్టీఆర్ ట్రస్టుకు ఫిబ్రవరి 15వ తేదీ మా మ్యూజికల్ కాన్సర్ట్ చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. ఈ షోలో భాగం కావడం చాలా ఆనందంగా వుంది. 
 
మేడం భువనేశ్వరి చాలా గొప్ప మనిషి. చాలా డౌన్ టు ఎర్త్ వుంటారు. చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి మనం చూశాం. ఏపీని ప్రగతిపధం వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు. ఈ మ్యూజికల్ షోలో సీనియర్ ఎన్టీఆర్ పాటల నుంచి ఇప్పటి ట్రెండ్ పాటల వరకూ అన్నీ వుంటాయి. ఫిబ్రవరి ఫస్ట్ నుంచి రిహార్సల్ చేస్తున్నాం. ఈ మ్యూజికల్ కాన్సర్ట్ చాలా క్రేజీగా ఉండబోతోంది. అందరికీ థాంక్ యూ సో మచ్' అని అన్నారు. 
 
కాగా, తాజా కొత్త సినిమాల విడుదలపై తమన్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. పేగు తెంచుకుని బిడ్డను కను రెప్పలు తెరవకముందే చంపేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్‌' విడుదల కాకముందే పైరసీ వీడియో వచ్చింది. దీనిపై తమన్ చేసిన ట్వీట్‌పై మెగాస్టార్ చిరంజీవి సైతం స్పందించారు. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Rashmika Mandanna: రష్మికకు కాలు బెణికింది.. వీల్ ఛైర్‌‌పై నడవలేని స్థితిలో..? (video)