Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రజాకార్ ఉద్యమంలో కమ్యూనిస్టుల పాత్ర లేదు - దర్శకుడు యాట

Razakar   Director Yata satyanarayana

డీవీ

, శనివారం, 1 జూన్ 2024 (15:37 IST)
Razakar Director Yata satyanarayana
ఆమధ్య తెలంగాణ నేపథ్యంకు సంబంధించిన రజాకార్ సినిమా విడుదలైంది. తెలంగాణ వాసిగా, కమ్యూనిస్టు పోరాటంలో పాలుపంచుకున్న వ్యక్తిగా దర్శకుడు యాట సత్యనారాయణ ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో చివరిలోనైనా కమ్యూనిస్టుల జెండా కూడా చూపించకుండా చేశారని అసలు కమ్యూనిస్టలు పాత్ర గురించి చెప్పలేదని చర్చ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జరుగుతోంది. దీనిపై తాజాగా దర్శకుడు వివరణ ఇచ్చారు.
 
రజాకార్ అనే సినిమా చరిత్రను చెప్పే ప్రయత్నం చేశా. అందుకే రాజారెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి.. ప్రధాన పాత్రలు కనుక వారి కోణంలో జరిగింది చెప్పాను. ఇక్కడ కమ్యూనిస్టులను దగ్గించలేదు. పైగా కాంగ్రెస్ ను తగ్గించలేదు. ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ వాడు. కేవలం నేను తగ్గించింది ఆంధ్ర మహాసభ పాత్ర. దానిని సినిమా టిక్ గా చూపించే ప్రయత్నం చేశాను.
 
కొందరు రెడ్డిస్ కు ఫేమర్ గా చేశావ్ అన్నారు. నేను అది చేయలేదు. నేను చరిత్రను చెప్పదలిచాను. చివరిలో కమ్యూనిస్టు జెండాను పెట్టకూడదు. పెడితే చరిత్ర తప్పుదోవపట్టించనట్లువుంది. వందమంది కమ్యూనిస్టులు వచ్చినా, ఆర్య సమాజ్ వారు వచ్చినా  కాంగ్రెస్ వారు వచ్చిన నేను తగిన సమాధానం చెబుతాను. నాకన్నా కమ్యూనిస్టు చరిత్ర తెలిసిన నాయకులు ఇప్పుడు ఎవరు వున్నారో మీరు చెప్పండి అంటూ ఎదురు ప్రశ్నంచారు. రాజాకార్ సినిమాను పూర్తిగా చెప్పాలంటే రెండు భాగాలుగా తీయాలి. అందుకు ఆర్థిక వనరులు వుంటే బాహుబలి లాగా సినిమా తీసేవాడిని అంటూ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హరి హర వీర మల్లు పూర్తి చేయడానికి ఏఎం రత్నం టీమ్ చర్చలు