Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి “మై డియర్ మార్తాండం” ట్రైలర్ విడుదల

Advertiesment
Comedian Prithvi
, బుధవారం, 26 డిశెంబరు 2018 (20:18 IST)
30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, రాకేందు మౌళి, కల్పికా గణేష్, జయప్రకాష్ రెడ్డి, కృష్ణ భగవాన్, తాగుబోతు రమేష్, కళ్యాణ్ విటపు( అర్జున్ రెడ్డి ఫేం)లు ముఖ్య తారాగణంగా కోర్ట్ రూమ్ డ్రామా కామేడి ఇంటరాగేషన్స్ జోనర్లో తెరకెక్కిన చిత్రం ‘’మై డియర్ మార్తాండం”. ఈ సినిమా ట్రైలర్‌ను అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ విడుదల చేసారు. అనంత‌రం సందీప్ రెడ్డి వంగ‌ మాట్లాడుతూ... ట్రైలర్ చూస్తుంటే ఔట్ అండ్ ఔట్ కామెడీగా సినిమా తెరకెక్కినట్టు కనపడుతుంది. ట్రైలర్ చాలా బాగుంది.
 
పృథ్వి కామెడీ టైమింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా అంద‌ర్నీ ఆకట్టుకొని మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. హీరో రాకేందు మౌళి మాట్లాడుతూ మా సినిమా పుల్ లెంగ్త్ కామెడి సస్పెన్స్ జోనర్లో తెరకెక్కించాం. చాలా బాగుంటుంది అని తెలిపారు. హీరోయిన్ కల్పికా గణేష్ మాట్లాడుతూ... దర్శకుడు హరీష్ కె.వి గారు మంచి పాయింట్‌తో ఈ సినిమాను తీశారు. సస్పెన్స్ డ్రామాలో సినిమా నడుస్తుంది, మీ అందరికి నచ్చుతుంది అన్నారు. 
 
దర్శకుడు హరీష్ కె.వి మాట్లాడుతూ... సినిమా చాలా బాగా వచ్చింది, కోర్ట్ రూమ్ డ్రామా, కామేడి ఇంటరాగేషన్స్ బ్యాక్డ్రాప్‌లో కథ నడుస్తుంది, సినిమాలో పృథ్వి కామెడీ చాలా బాగా వచ్చింది, ఈ డిసెంబర్ 29న వస్తున్నాం. ప్రేక్షకులు ఆదరించి హిట్ చేస్తారని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిత్లీ తుఫాను ఎఫెక్ట్... సురక్షిత మంచి నీటికోసం అల్లు అర్జున్ ముందడుగు