Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తప్పతాగితే స్కామా? క్యాన్సర్ లేదు.. ఏమీలేదు.. కృష్ణ భగవాన్‌ వివరణ..!

తప్పతాగితే స్కామా? క్యాన్సర్ లేదు.. ఏమీలేదు.. కృష్ణ భగవాన్‌ వివరణ..!
, మంగళవారం, 26 ఏప్రియల్ 2016 (15:20 IST)
సినీ నటుడు కృష్ణ భగవాన్‌కు క్యాన్సర్ అంటూ ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కృష్ణ భగవాన్‌కు సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారని కొందరంటే.. మరికొందరు ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని ప్రచారం చేశారు. ఈ వార్తలపై కృష్ణ భగవాన్ వివరణ ఇచ్చుకున్నాడు.  
 
కొంత‌కాలంగా తీవ్ర‌మైన న‌డుము నొప్పితో బాధపడుతున్నందు వల్ల సినిమాలకు కాస్త విరామం ఇచ్చాను. అంతేకానీ అవకాశాలు లేకుండా కాదని.. తాను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని కృష్ణ భగవాన్ చెప్పాడు. వంశీ దర్శకత్వం వహించిన 'మహర్షి' సినిమాలో శాంతిప్రియ భర్తగా నటించి సినీ పరిశ్రమకు పరిచయమైన కృష్ణభగవాన్.. కామెడీ నటుడిగా ఎదిగాడు. 
 
తనపై రూమర్లకు కృష్ణ భగవాన్ స్పందించాడు. తనకు కేన్సర్ కాదని తీవ్రమైన వెన్ను నొప్పితో భాధపడుతున్నానని వెల్లడించాడు. దీని నివారణకు యోగాతో సాంత్వన పొందుతున్నానని మీడియాకు ప్రకటించాడు.
 
గతంలో పాపులర్ కమెడియన్ కృష్ణ భగవాన్ తాగుడు మీద పెద్ద దుమారమే లేచింది. ఆయన తాగేసి కాలేజీలో చేసిన వీరంగం ఎవరు మర్చిపోరు. అదే అడిగితే తాను ఏదో పెద్ద స్కామ్ చేసినట్టు మీడియా ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హిందూ మ‌తానికి తిరిగి ఏసుదాసు