Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చచ్చిపోతే, నా కొడుకు వద్దకు వెళ్లి వాడితో ఆడుకోవచ్చు అనుకున్నా : నటుడు బాబు మోహన్

తన పెద్ద కుమారుడు చనిపోయినపుడు ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నానని టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ హాస్య నటుడు, తెరాస నేతల బాబూ మోహన్ చెప్పారు. ఆయన ఓ న్యూస్ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు

Advertiesment
Comedian Babu Mohan
, సోమవారం, 8 మే 2017 (10:37 IST)
తన పెద్ద కుమారుడు చనిపోయినపుడు ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నానని టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ హాస్య నటుడు, తెరాస నేతల బాబూ మోహన్ చెప్పారు. ఆయన ఓ న్యూస్ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘నా పెద్ద కొడుకు చనిపోయిన తర్వాత నేను ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. ఓ వెలుగు వెలిగాను, ఇక చాలులే, తొందరగా చచ్చిపోతే, నా కొడుకు దగ్గరకు వెళ్లిపోవచ్చు, వాడితో ఆడుకోవచ్చు అని అనుకునేవాడిని. ఒక రోజున నాకే అనిపించింది. ఎంతో మందికి సాయం చేశాను, నేను ఎందుకు చనిపోవాలని అనిపించింది. 
 
మా పెద్దబ్బాయి చనిపోయిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడినే కాదు, మూడు నెలల పాటు నేనున్న గది తలుపులు కూడా వేసే ఉంచేవాడిని.. ఏడుస్తూ ఉండేవాడిని. ఇంట్లో ఎవరి గదిలో వారు అదేవిధంగా ఉండేవారు. లైట్లు కూడా వెలిగించే వాళ్లం కాదు. ఆల్మోస్ట్ చీకట్లో ఉన్నట్లే ఉండేవాళ్లం. ఒకరోజు ఎందుకో, ఇంట్లో నుంచి బయటకు వస్తే, దర్శకుడు ఈవీవీ సత్యనారాయణగారు నన్ను పిలిచారు. ఎంతో యాక్టివ్‌గా ఉండే నన్ను అలా చూసి ఆయన బాగా ఫీలయ్యారు. ‘ఎవడిగోల వాడిది’ షూటింగ్ ఉంది, బ్యాంకాక్ వెళ్లిపోదాం, రెండు నెలలు ఉండొద్దాం’ అని తీసుకువెళ్లారు. అలా, ఎంత మరిచిపోలేని విషయాలనైనా, గుంపులో పడితే మార్పు వస్తుందని తెలుసుకున్నాను’ అని చెప్పుకొచ్చారు. 
 
అలా బ్యాంకాక్‌కు వెళ్లాం. అక్కడ సాయంత్రం ఆరింటికి షూటింగ్‌ ప్యాకప్‌ చెబుతూనే ‘ఉస్కో..’ అనేవారు ఈవీవీ. ఫిష్‌ తినటానికి వెళ్లేవాళ్లం. అదికూడా ఫుట్‌మసాజ్‌ చేయించుకుంటూ స్పూన్‌తో ఫిష్‌ తింటుంటే.. ఈవీవీగారు ‘బాబూ ఓకే కదా..’ అనేవారు. అలా బ్యాంకాక్‌లో 45 రోజులూ అదే పని. దీంతో మామూలు జీవితంలో కలిసిపోయాను. ఈ లోపల చిన్నబాబుకి పెళ్లి చేశాను. నేను షూటింగ్‌లతో అడపాదడపా బిజీగా ఉండేవాణ్ణి. ఆ లోపే ఎన్నికలు వచ్చాయి. నేనేమో డిప్రెషన్‌ వల్ల అంతకు ముందు నియోజకవర్గాల్లోకి వెళ్లలేదు. మళ్లీ జనాల్లోకి వెళ్లాలనుకున్నాను. నామినేషన్‌ వేయటానికి వెళ్లాను. పోటీకి నిల్చున్న ప్రత్యర్థి అందరినీ కొనేశాడు. దీంతో నాకు ఓటమి తప్పలేదు. ఇదేంటీ అనుకునేలోపే ఇంటికి మనమరాలు వచ్చింది. సరెండర్‌ అయిపోయా. ఆ మాయ అద్భుతం. మనవరాలి కేకలతో మా ఇంట్లో లైట్లు వెలిగాయి. వెలుతురు వచ్చేసింది. మా ఇంటి తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి అని చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాలీవుడ్ థర్డ్ గ్రేడ్ ఇండస్ట్రీ అనుకున్నాం కాని ఇంత దెబ్బ కొడుతుందనుకోలేదే.. షాక్‌లో బాలీవుడ్