Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోస్ట్‌ ప్రొడక్షన్‌లో 'చుట్టాలబ్బాయి' : తమన్ వచ్చాక ఆడియో రిలీజ్!

పోస్ట్‌ ప్రొడక్షన్‌లో 'చుట్టాలబ్బాయి' : తమన్ వచ్చాక ఆడియో రిలీజ్!
, బుధవారం, 25 మే 2016 (12:04 IST)
ఆది హీరోగా వీరభద్రమ్‌ దర్శకత్వంలో వెంకట్‌ తలారి, రాము తాళ్ళూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'చుట్టాలబ్బాయి'. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌లో భాగంగా డబ్బింగ్‌ జరుపుకుంటోంది. 
 
ఈ సందర్భంగా నిర్మాతలు వెంకట్‌ తలారి, రాము తాళ్ళూరి మాట్లాడుతూ - ''ఇటీవల చిత్రీకరించిన క్లైమాక్స్‌తో టోటల్‌గా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్‌ వర్క్‌ జరుగుతోంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ ప్రస్తుతం యు.ఎస్‌.లో వున్నారు. ఆయన రాగానే ఆడియో రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు. 
 
దర్శకుడు వీరభద్రమ్‌ మాట్లాడుతూ - ''ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. ఆదికి మరో మంచి సినిమా అవుతుంది. ఈ చిత్రం కోసం థమన్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీ ట్యూన్స్‌ ఇచ్చారు. ఈ సినిమా నాకు, ఆదికి మంచి సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది'' అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కబాలి టీమ్‌తో కష్టం అనిపించలేదు.. రజినీ సార్ చాలా సింపుల్.. మైండ్ బ్లాంక్!!