Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆరాధ్య దేవి అందాలతో పాట చిత్రీకరించిన రామ్ గోపాల్ వర్మ

Advertiesment
Aaradhya song shoot

డీవీ

, శనివారం, 23 మార్చి 2024 (18:20 IST)
Aaradhya song shoot
ఇటీవలే రాజకీయ నేపథ్యం చిత్రాలు తీసి అలసిపోయిన రామ్ గోపాల్ వర్మ తాజాగా తన పార్మెట్ లో లేడీ నేపథ్యం గల సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. కేరళకు చెందిన  ఆరాధ్య దేవత అనే పేరు గల అమ్మాయిని ఎంపిక చేసి కూర్గ్ లో ఓ సాంగ్ షూట్ చేశాడు. దానికి సంబంధించిన ఫొటోలు, రీల్స్ ను పెట్టి సోషల్ మీడియాలో అప్ డేట్ ఇస్తున్నాడు. 
 
webdunia
kavaya, varam, ardhya
నేను పోస్ట్ చేసిన కేరళ అమ్మాయి శ్రీలక్ష్మి సతీష్ (ఆరాధ్య దేవత) యొక్క ఈ రీల్‌ను గుర్తుంచుకోండి శారీ సినిమా కోసం డెన్ ఫిల్మ్ ప్రొడక్షన్ కోసం ఆమెతో సంతకం చేయించాను అని తెలిపారు. కూర్గ్‌లో శారీ పాట చిత్రీకరణకు సంబంధించిన ముగింపు సందర్భంగా మా
బృందానికి ధన్యవాదాలు అంటూ తెలిపారు. 
 
అదేవిధంగా సాంగ్ షూట్ చేస్తుండగా,  తన టీమ్ లో వున్న రచయిత్రి కావ్య, ఓ షాట్ ను 
 కొరియోగ్రాఫర్ సుభాష్ నేత్రుత్వంలో, కూర్గ్‌లో ఆరాధ్య పాట షూట్ చేస్తున్న నా చిత్రాన్ని ఇలా బంధించింది అని తెలుపుతూ మరో పోస్ట్ పెట్టాడు.
 
ఇక ‘శారీ’ సినిమా ఒక సైకలాజికల్‌ థ్రిల్లర్‌. యాధృశ్చికంగా ఒక ఇన్‌స్టా  రీల్‌లో చూసి కేరళ అమ్మాయిని  ‘శారీ’ కి సెలెక్ట్‌ చేసి సిల్వర్‌ స్క్రీన్‌కి పరిచయం చేస్తున్నారు. ఆ శారీ భామ పేరు ‘ఆరాధ్యదేవి’. ఆమె ఫస్ట్‌లుక్‌ను ఆర్జీవి డెన్‌ టాలెంటెడ్‌ ఫోటోగ్రాఫర్‌ యశ్వంత్‌ క్లిక్‌ మనిపించంగా రామ్‌గోపాల్‌ వర్మ మీడియాకి తన హీరోయిన్‌ని ఇదివరకే పరిచయం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాలో ఓపిక, మీరు ఆదరించేవరకూ సినిమాల్లోనే వుంటాను: పద్మ విభూషణ్ చిరంజీవి