మా సినిమా అని పొగడుకోకూడదు కానీ.. చూస్తే షాక్ కొట్టడం ఖాయం!
‘‘కొన్ని అదృశ్య శక్తుల వల్ల చిత్రాంగద జీవితం ఏ విధంగా చిక్కుల్లో పడింది తనకు ఎదురైన సవాళ్లను అధిగమించే క్రమంలో ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి వాటిని ఎలా ఎదుర్కొంది’’ అన్నదే ‘చిత్రాంగద’ కథాంశం’’ అని నిర్మాతలు గంగపట్నం శ్రీధర్, రెహమాన్ అన్నారు
‘‘కొన్ని అదృశ్య శక్తుల వల్ల చిత్రాంగద జీవితం ఏ విధంగా చిక్కుల్లో పడింది తనకు ఎదురైన సవాళ్లను అధిగమించే క్రమంలో ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి వాటిని ఎలా ఎదుర్కొంది’’ అన్నదే ‘చిత్రాంగద’ కథాంశం’’ అని నిర్మాతలు గంగపట్నం శ్రీధర్, రెహమాన్ అన్నారు. అంజలి ప్రధాన పాత్రలో ‘పిల్ల జమీందార్’ ఫేం అశోక్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘చిత్రాంగద’. తమిళంలో ‘యార్నీ’ పేరుతో విడుదలవుతోంది.
శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీధర్, రెహమాన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో సురక్ష ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత మల్కాపురం శివకుమార్ ఈ నెల 10న విడుదల చేస్తున్నారు. తమిళంలో కూడా అదే రోజున ఈ చిత్రం విడుదల కానుంది. ఆయన మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని థ్రిల్లర్ కామెడీ జానర్‌లో రూపొందిన చిత్రమిది. సినిమా ఆద్యంతం ఉత్కంఠగా, ఆసక్తికరంగా ఉంటుంది. స్క్రీన్ లైట్‌గా ఉన్న ఈ చిత్రంలోని ట్విస్ట్‌లు ప్రేక్షకులను షాక్ గురి చేస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం సెల్వగణేష్, స్వామినాథన్, కెమెరా బాల్‌రెడ్డి (హైదరాబాద్), జేమ్స్ క్వాన్, రోహిన్ (యూఎస్‌ఎ), సమర్పణ టీసీఎస్ రెడ్డి, వెంకట్ వాడపల్లి.