మెగాస్టార్ చిరంజీవి అభిమానులకో శుభవార్త. చిరంజీవి 150వ సినిమా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్‌కు స్వీట్ న్యూస్ ఏంటంటే..? మెగాస్టార్ 150వ సినిమాకు ముహూర్తం పెట్టేశారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఎస్‌జే సూర్యతో చేసే సినిమాకు పవన్ కల్యాణ్ కూడా అదే రోజున ముహూర్తం ఖరారు చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇందుకు ఆపై ముహుర్తాలు లేకపోవడమే కారణమని సమాచారం.
సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ తర్వాత పవన్ కల్యాణ్ ఎస్.జే. సూర్య దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే చిరంజీవి కూడా వినాయక్ డైరక్షన్‌లో నటించనున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇద్దరూ శుక్రవారం తమ సినిమాకు ముహూర్తపు షాట్ కొట్టాలని డిసైడ్ అయ్యారు.
అన్నాతమ్ముళ్ల సినిమాలు ఒకే రోజున ప్రారంభం కావడం మెగా ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్నిస్తోంది. ఇప్పటికే బ్రూస్ లీ, సర్దార్ గబ్బర్ సింగ్, లోఫర్ వంటి సినిమాలు మెగా హీరోలకు ఫ్లాప్ టాక్‌ను మాత్రమే సంపాదించిపెట్టాయి. ఇకనైనా పవన్ కల్యాణ్, చిరంజీవిల కొత్త చిత్రాలు హిట్ అవుతాయని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక చిరంజీవి నటించనున్న 150వ సినిమాకి కత్తిలాంటోడు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. పవన్ సినిమాకు హుషారు అనే టైటిల్‌ని ఖరారు చేసే అవకాశం ఉంది.