Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిరు ఆ విషయంలో మహేష్‌ను మించగలడా???

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఖైదీ నెం.150 సినిమాతో అదిరిపోయింది. అదే పాత చిరంజీవిని గుర్తు చేస్తూ నటన, డ్యాన్స్‌లు మరియు ఫైట్‌లలో ఇరగదీసాడు. తనలో వయస్సు ప్రభావం ఏమాత్రం కనిపించకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ నటించాడు. ఇక ఎప్పటిలా హీర

చిరు ఆ విషయంలో మహేష్‌ను మించగలడా???
, శుక్రవారం, 28 జులై 2017 (18:52 IST)
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఖైదీ నెం.150 సినిమాతో అదిరిపోయింది. అదే పాత చిరంజీవిని గుర్తు చేస్తూ నటన, డ్యాన్స్‌లు మరియు ఫైట్‌లలో ఇరగదీసాడు. తనలో వయస్సు ప్రభావం ఏమాత్రం కనిపించకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ నటించాడు. ఇక ఎప్పటిలా హీరోల మధ్య ఉన్న పోటీ కాస్త రసవత్తరంగా మారింది. అదలా ఉంచితే చిరంజీవి గతంలో చేసిన "థమ్స్‌అప్" యాడ్‌ని మహేష్ బాబు గత కొన్ని సంవత్సరాలుగా ప్రమోట్ చేస్తున్నాడు. అందులోనూ చిరంజీవి మంచి ఫాంలో ఉన్న సమయంలోనే మహేష్ తన సినిమాలతో గట్టి పోటీ ఇచ్చాడు. 
 
థమ్స్‌అప్‌తో మొదలుకొని మహేష్ ఇప్పటికీ అనేక బ్రాండ్‌లకు ప్రచారకర్తగా ఉన్నారు. ఇక తన సినిమాలు తెలుగు రాష్ట్రాలకంటే, ఓవర్‌సీస్‌లో అధిక వసూళ్లు రాబడుతూ ఎవరికీ అందనంత దూరంలో ఉన్నాడు. అంతేకాకుండా గతంలో "పవన్‌కళ్యాణ్" కూడా "పెప్సీ" పానియానికి ప్రచారకర్తగా చేసారు, ఆ తర్వాత "రామ్‌చరణ్" సైతం అదే పానియానికి ప్రచారం చేసారు. అయితే వాళ్లు ఇప్పుడు ఏ బ్రాండ్‌కి ప్రచారం చేయడం లేదు. 
 
కానీ మహేష్ మాత్రం తన బ్రాండ్ విలువను పెంచుకుంటూ, దానిని కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. కానీ చిరంజీవి "మీలో ఎవరు కోటీశ్వరుడు" ద్వారా తన బ్రాండ్ విలువను పెంచుకునే ప్రయత్నం చేసినప్పటికీ, తనదైన ముద్రతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. ఇక అదలా ఉంచితే తన బ్రాండ్‌తో పాటుగా సరైన సినిమాలను ఎంపిక చేసుకుని నటించాల్సిన పరిస్థితిలో ఉన్నారు "చిరు".

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రగ్స్ కేసు... సిట్ ప్రశ్నలకు ఎదురు ప్రశ్నలేస్తున్న 'కిక్' రవితేజ?