Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శిరీష్... నీ వెనుక చిరంజీవి ఉన్నా లాభం లేదు... 'శ్రీరస్తు-శుభమస్తు'లో చిరు ప్రసంగం

150వ చిత్రంలో నటిస్తూ ఉన్న చిరంజీవి తన మేనల్లుడు చిత్రం శ్రీరస్తు శుభమస్తు ప్రి -రిలీజ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మా మామయ్యగారి అల్లు వర్థంతిని గుర్తు చేసుకుంటూ ఘనమైన ని

Advertiesment
శిరీష్... నీ వెనుక చిరంజీవి ఉన్నా లాభం లేదు... 'శ్రీరస్తు-శుభమస్తు'లో చిరు ప్రసంగం
, సోమవారం, 1 ఆగస్టు 2016 (12:52 IST)
150వ చిత్రంలో నటిస్తూ ఉన్న చిరంజీవి తన మేనల్లుడు చిత్రం శ్రీరస్తు శుభమస్తు ప్రి -రిలీజ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మా మామయ్యగారి అల్లు వర్థంతిని గుర్తు చేసుకుంటూ ఘనమైన నివాళులు అర్పిస్తూ శ్రీరస్తు - శుభమస్తు గురించి మాట్లాడటం సబబుగా ఉంటుంది. నేను ఆల్రెడీ ఈ టైటిల్‌తో ఉన్న చిత్రాన్ని నటించాను, 80ల్లో నటించాను. తిరిగి ఆ టైటిల్‌తోటే వస్తుందంటే నేను కనెక్ట్ అయ్యాను.
 
ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను, ఇది నా చిత్రం టైటిల్. అత్యధిక సినిమాల విజయవంతమైన చిత్రాలను అందించిన గీతా ఆర్ట్స్ బ్యానర్‌ అధినేత అల్లు అరవింద్ నిర్మాతగా నేను ఎన్నో చిత్రాల్లో నటించాను. అల్లు అరవింద్ యువతకు, ప్రేక్షకులకు ఏం కావాలని చూస్తూ ఆధునీకరించకుంటూ ఉంటారు. ఇకపోతే నేను శ్రీరస్తు శుభమస్తు ఫస్ట్ కాపీ చూశాను. డైరెక్టర్ పరుశురామ్ చక్కగా హ్యాండిల్ చేశారు. ప్రేమ పెళ్లికి అభ్యంతరం చెప్పే తల్లీదండ్రుల మధ్య ఇగో క్లాష్. ధనిక తండ్రి మధ్యతరగతిపై ఉండే చిన్నచూపు. బొమ్మరిల్లు చిత్రం నాకు గుర్తుకు వచ్చింది. ఈ చిత్రంలో శిరీష్ కొత్తగా కన్పించాడు. శిరీష్ ఆర్టిస్టు అవుతాడని అనుకోలేదు.
 
నాన్న అల్లు అరవింద్ గారికి బాసటగా ఉంటాడని అనుకున్నాను. సినిమా లెక్కలు మాట్లాడుతూ ఉండేవాడు. బిజినెస్ పరంగా అతడి లెక్కలు ఉండేవి. చాలా మంచి నిర్మాత అవుతాడని అనుకున్నాను. అలాంటి శిరీష్ ఒకరోజు నా దగ్గరికి వచ్చి ఆర్టిస్ట్ అవ్వాలని అనుకున్నానంటే నేను సైలెట్ అయ్యాను. నిర్మాత అవ్వవచ్చు కదా అని చెప్పలేదు. ఫ్యామిలీలో అభిమానులున్నారని చెప్పా. మిగతావాళ్లలా కమర్షియల్ చిత్రాలను తీయాలంటూ హడావుడి పడకుండా ముందుకు వెళుతున్నాడు. పదిమందిలో ఒకడిలా కాకుండా భిన్నమైన సబ్జెక్టులను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. మంచి భవిష్యత్తు ఉంది. చిత్రాల్లోకి రావడం ముఖ్యం కాదు.. వచ్చిన తర్వాత నిలబెట్టుకోడం ముఖ్యం. వెనుక చిరంజీవి ఉన్నా లాభం లేదు. తన కష్టం అతడిని నిలబెడుతుంది అంటూ ముగించారు చిరంజీవి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కమల్‌కు మరోమారు ఆపరేషన్... చూసేందుకు వెళ్లిన రజినీకి నిరాశ!