Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాకు క్యాన్సర్ సోకిందనే వార్తల్లో నిజం లేదు.. మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ

Advertiesment
Megastar Chiranjeevi
, శనివారం, 3 జూన్ 2023 (21:56 IST)
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో, మెగాస్టార్ చిరంజీవి తన ఆరోగ్యంపై వ్యాపించిన పుకార్లపై వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. తనకు క్యాన్సర్ సోకిందన్న వార్తలను తీవ్రంగా ఖండించారు. 
 
క్యాన్సర్ అవగాహన- ప్రాముఖ్యత గురించి తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడమే ఇందుకు కారణమని చిరంజీవి అన్నారు. ఈ వ్యాధికి వ్యతిరేకంగా నివారణ చర్యలు తీసుకోవాలని.. ఇందుకు క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్‌కు ప్రోత్సహిస్తున్నట్లు చిరంజీవి ఉద్ఘాటించారు. 
 
క్యాన్సర్ కాని పాలిప్స్‌ను గుర్తించి, తొలగించడానికి కొలనోస్కోపీ పరీక్షను చేయించుకున్నానని చిరంజీవి తెలిపారు. ఈ పరీక్ష ద్వారా ముందస్తుగా గుర్తించడం వల్ల క్యాన్సర్ అభివృద్ధిని నిరోధిస్తుందని నొక్కి చెప్పారు. టెస్టు చేయించుకున్నంత మాత్రాన క్యాన్సర్ వున్నట్లు కాదని స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి.. సాయం చేయండి ప్లీజ్.. నూకరాజు