Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'ఖైదీ నెం.150' థర్టీ డేస్ కలెక్షన్స్... 'బాహుబలి' రికార్డులు గల్లంతు

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150". గత సంక్రాంతి పండుగ రోజున విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డును బద్ధలు కొట్టింది. ముఖ్యంగా నాన్ 'బాహుబ

'ఖైదీ నెం.150' థర్టీ డేస్ కలెక్షన్స్... 'బాహుబలి' రికార్డులు గల్లంతు
, మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (09:41 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150". గత సంక్రాంతి పండుగ రోజున విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డును బద్ధలు కొట్టింది. ముఖ్యంగా నాన్ 'బాహుబలి' రికార్డులన్నీ చెరిపేసిన టాలీవుడ్ టాప్-2 చిత్రంగా నిలిచింది. సుమారు 9 యేళ్ల తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చినా.. ఇప్పటికీ టాలీవుడ్ నెం.1 అనిపించుకొన్నాడు.
 
మెగా 'ఖైదీ' ప్రేక్షకుల ముందుకొచ్చి సోమవారంతో సరిగ్గా నెలరోజులు. ఇప్పటికే రూ.100 కోట్ల షేర్‌ని రాబట్టింది. మొత్తం నెలరోజుల్లో మెగా 'ఖైదీ' రూ.102.2 కోట్ల షేర్‌ని వసూలు చేసింది. ఇక, మెగా ఖైదీ నెలరోజుల కలెక్షన్స్ ఏరియాల వారీగా పరిశీలిస్తే... 
 
నైజాం రూ.19.5 కోట్లు, సీడెడ్ రూ.15 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.12.5 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ.8.1 కోట్లు, వెస్ట్ గోదావరి రూ.5.96 కోట్లు, కృష్ణా రూ.5.7 కోట్లు, గుంటూరు రూ.7.26 కోట్లు, నెల్లూరు రూ.3.30 కోట్లు, కర్ణాటక రూ.9.00 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో రూ.1.7 కోట్లు, అమెరికా రూ.10 కోట్లు, ఇతర దేశాల్లో రూ.3 కోట్లు, మొత్తం రూ.101.2 కోట్లుగా ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాడు సంక్షోభం : పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించిన లారెన్స్