Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒక మనసుకు నెగటివ్ టాక్.. గ్లామర్ కంపల్సరి.. సో.. నిహారిక సినిమాలొద్దంటున్న చిరంజీవి..!

మెగా కుటుంబం నుంచి హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన నిహారిక తొలి చిత్రం ఒక మనసుతో హిట్ టాక్ సొంతం చేసుకోలేకపోయింది. మెగా ఫ్యామిలీ నుంచి తొలిసారిగా నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుండడంతో టాలీవుడ్ జనమంతా ఆసక

ఒక మనసుకు నెగటివ్ టాక్.. గ్లామర్ కంపల్సరి.. సో.. నిహారిక సినిమాలొద్దంటున్న చిరంజీవి..!
, ఆదివారం, 3 జులై 2016 (16:03 IST)
మెగా కుటుంబం నుంచి హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన నిహారిక తొలి చిత్రం ఒక మనసుతో హిట్ టాక్ సొంతం చేసుకోలేకపోయింది. మెగా ఫ్యామిలీ నుంచి తొలిసారిగా నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుండడంతో టాలీవుడ్ జనమంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఒక మనసులో నిహారిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ ఒక మనసులో చాలా చోట్ల మెచ్యూర్డ్ నటన కారణంగా విఫలమైందని విమర్శలు వచ్చాయి.
 
దీంతో సినిమా బోరింగ్ అని టాక్ వచ్చింది. తద్వారా తాను ఎంతో ఎత్తుకు ఎదుగుతానని ఆశించిన నిహా ఆశలన్నీ అడియాశలయ్యాయి. దాంతో ఒక మనసు తర్వాత నిహారిక పూర్తిగా కనిపించడం మానేసింది. ప్రమోషన్స్‌కు దూరమైంది. అంతేకాదు.. పెద్దగా ఎవరితోనూ అంతగా మాట్లాడటం లేదట. దీంతో నిహారిక ఇక సినిమాలు చేస్తుందా..? చేయదా? అనే ప్రశ్న తలెత్తింది. గ్లామర్ టచ్ ఉంటేనే సినీ రంగంలో రాణిస్తుంది. కానీ నిహారిక ఫ్యామిలీ అందుకు అంగీకరించారు.  
 
ఇలాంటి పరిస్థితుల్లో నిహారిక సినిమాల్లో కొనసాగాలా? లేకుంటే గుడ్ బై చెప్పాలా? అనే డైలమాలో ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్ వస్తోంది. చిరంజీవికి ముందు నుంచే నిహారిక హీరోయిన్ అవ్వడం ఇష్టంలేదనే టాక్ వినిపిస్తోంది. చిరు అయితే ఇప్పటికైనా ఆమెతో సినిమాలు మానిపించేయాలని చూస్తున్నాడట. మరి నిహారిక ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శరవేగంగా జనతా గ్యారేజ్ షూటింగ్.. జూలై 22న ఆడియో.. జూలై 6న రిలీజ్!