Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శరవేగంగా జనతా గ్యారేజ్ షూటింగ్.. జూలై 22న ఆడియో.. జూలై 6న టీజర్ రిలీజ్

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా జనతా గ్యారేజ్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ అంచనాలకు తగ్గట్టుగా మూవీ టీమ్ టీజర్‌ని రెడీ చేస్తున్నట్లు సమాచారం. కొరటాల

శరవేగంగా జనతా గ్యారేజ్ షూటింగ్.. జూలై 22న ఆడియో.. జూలై 6న టీజర్ రిలీజ్
, ఆదివారం, 3 జులై 2016 (12:16 IST)
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా జనతా గ్యారేజ్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ అంచనాలకు తగ్గట్టుగా మూవీ టీమ్ టీజర్‌ని రెడీ చేస్తున్నట్లు సమాచారం. కొరటాల శివ తెరకెక్కిస్తున్న జనతా గ్యారేజ్ చిత్రంలో సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. 
 
ఇక దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్న ఆడియోకి సంబంధించిన వేడుక జూలై 22న భారీ ఎత్తున నిర్వహించాలనుకుంటున్నారు. ఇక ప్రస్తుతం చిత్ర షూటింగ్ చివరి దశలో ఉండగా మూవీ రిలీజ్ ఆగస్ట్ 12న ఉంటుందన్న సంగతి తెలిసిందే. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన చిత్ర పోస్టర్స్, వర్కింగ్ స్టిల్స్ మూవీపై భారీ అంచనాలు నెలకొనేలా చేశాయి. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ టీజర్‌ని జూలై 6న విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామ్ గోపాల్ వర్మపై విరుచుకుపడిన వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి.. సినిమా చూడొద్దు..!