మాటీవీ ప్రోమో రిలీజ్.. సిగ్నేచర్ మ్యూజిక్‌కు విజిల్ చేస్తూ చిరంజీవి అదుర్స్..
మాటీవీ వివిధ ప్రోమోలను రిలీజ్ చేసింది. తన ఫోటోలతో కూడిన కొత్త యాడ్ ప్రోమోలో మెగాస్టార్ చిరంజీవి హుందాగా నడుస్తూ.. ఈ షో సిగ్నేచర్ మ్యూజిక్‌ని విజిల్ చేస్తూ సాగడం చూసిన ఫోటోను భారీ కామెంట్స్ వస్తున్నాయి
మాటీవీ వివిధ ప్రోమోలను రిలీజ్ చేసింది. తన ఫోటోలతో కూడిన కొత్త యాడ్ ప్రోమోలో మెగాస్టార్ చిరంజీవి హుందాగా నడుస్తూ.. ఈ షో సిగ్నేచర్ మ్యూజిక్‌ని విజిల్ చేస్తూ సాగడం చూసిన ఫోటోను భారీ కామెంట్స్ వస్తున్నాయి. ఈ షో ఎంట్రీలకు చిరంజీవి విజిల్ ఫైనల్ కాల్ కావచ్చునని భావిస్తున్నారు. ఇటీవలే మొదటి ప్రోమోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మీలో ఎవరు కోటీశ్వరుడు షో హోస్ట్‌గా రానున్న మెగాస్టార్ చిరంజీవి దీన్ని ప్రమోట్ చేయడానికి మేకప్ వేసుకున్న సంగతి విదితమే.
ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఇప్పటికే తన 150వ సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్న చిరు, అదే సమయంలో బుల్లితెర అరంగేట్రానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నాడు. తెలుగు టెలివిజన్ రంగంలో సంచలనం సృష్టించిన మీలో ఎవరు కోటీశ్వరుడు నాలుగో సీజన్కు చిరంజీవి వ్యాఖ్యతగా వ్యవహరించనున్నాడు.
గత మూడు సీజన్లలో వ్యాఖ్యతగా స్టార్ హీరో నాగార్జున వ్యవహరించగా రాబోయే సీజన్లో మాత్రం ఆ బాధ్యతను మెగాస్టార్ తీసుకున్నాడు. త్వరలో మా టివీలో ప్రసారం కానున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన టీజర్.. భారీ స్పందన వచ్చింది.